mp and mlas pitch for yeddurappa, karnataka party head

Chorus for yedurappa return

chorus for yedurappa return, karnataka mp's and mla pitch for yeddyurappa, karnataka mp's and mla demand return of yeddyurappa, demand conveyed to PM, bring back yeddyurappa as karnataka head, bangalore bjp national execitive meet, prime minister narendra modi, bjp national president amit shah, bjp karnataka head yeddurappa,

parliament members and legisalative members of karnataka picth for return of yeddyurappa in karnataka

యడ్యూరప్పకే మళ్లీ ఆదిపత్య పగ్గాలు..

Posted: 04/03/2015 11:37 AM IST
Chorus for yedurappa return

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూర్పప్పకు మళ్లీ అధికార పగ్గాలు దక్కె అవకాశాలు వున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో బిజేపీ జాతీయస్థాయి కార్యవర్గ సమావేశం సందర్భంగా మళ్లీ యడ్యూరప్ప పేరు తెరపైకి వచ్చింది. కర్ణాటకలో యడ్యూరప్ప కృషి ఫలితంగానే బీజేపి అధికారంలోకి వచ్చిందని, ఆయన పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డారని ఆ పార్టీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువచ్చారు. మోడీ సహా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికీ వారు తమ ప్రతిపాదనలను తీసుకువెళ్లారు

జాతీయ కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న నరేంద్ర మోడీని నిన్న రాత్రి కలసిన బీజేపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ మేరకు ఆయన ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. యడ్యూరప్పను మరోమారు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే.. పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, త్వరలో రానున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే పార్టీకి మళ్లీ పూర్వ వైభవ తీసుకురావడం యడ్యూరప్పకే సాధ్యమని వారు ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యడ్యూరప్పను కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు కూడా రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  yeddyurappa  party head  

Other Articles