telangana transporation department | private vehicles tax controversy

Telangana transporation department revealed tax details of private vehicles

telangana tax controversy, private vehicles tax news, telangana transporation department, telangana vehicles tax details, telangana tax details, private buses tax details, telangana revealed tax details

telangana transporation department revealed tax details of private vehicles : Recently telangana transporation department has released the details of tax of inter state private vehicles which enters in telangana state.

ఏపీ వాహనాలు తెలంగాణాలో ఎంట్రీ ఇస్తే ‘పన్ను’ల బాదుడే!

Posted: 03/31/2015 08:21 PM IST
Telangana transporation department revealed tax details of private vehicles

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రవేశించే అన్నిరకాల వాహనాలనుంచి ప్రవేశపన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని టీ-ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే! మంగళవారం అర్థరాత్రి నుంచి అమలు చేయనున్న ఈ అంతర్రాష్ట్ర రవానా ట్యాక్స్ లను తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు కూడా అంతర్రాష్ట్ర ట్యాక్స్ వసూలు చేస్తామని స్పష్టం చేసిన తెలంగాణ రవాణా శాఖ.. ఈ నేపథ్యంలో ఏపీ వాహనాలు చెల్లించాల్సిన ట్యాక్సుల వివరాలను వెల్లడించింది.

హెవీ వెహికల్స్ కు రూ.2970 నుంచి రూ.5740 వరకు వసూలు చేయనున్నారు. అలాగే మీడియం వెహికల్స్ కు రూ.1950 నుంచి రూ.2440 వరకుగానూ, లైట్ మోటార్ వెహికల్స్ కు రూ.430 నుంచి రూ.1280 వరకు వసూలు చేయనున్నారు. ఇక ఆలిండియా మ్యాక్సీ క్యాబ్స్ కు సీటుకు చొప్పున 1300 రూపాయలు వసూలు చేయనున్నట్లు టీ రవాణా శాఖ వివరాలను తెలిపింది. ఇలా ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా మూడు నెలల కాలానికి ఆంధ్రరాష్ట్ర వాహనాల నుంచి సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయలు వస్తాయని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు.

హైకోర్టు ఆదేశాల మేరకే తాము పన్నులు విధించామని తెలుపుతున్న తెలంగాణ రవాణా శాఖాధికారులు... మూడు నెలలకోసారి పన్ను వసూలు చేసే అవకాశం వుండటంతో రేపు (బుధవారం) ఏపీ వాహనాలకు పన్నులు కట్టుకోవాలని వారు సూచించారు. అయితే... ఆర్టీసి విభజన ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల నుంచి పన్నుల వసూలుకు సమయం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఏదైతేనేం.. పొరపాటున ఏపీ వాహనాలు తెలంగాణాలో అడుగుపెడితే.. పన్నుల రూపంలో బాదుడేనన్నమాట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana transporation department  private vehicles tax controversy  

Other Articles