Rama Nawami | Celebrations | Bhadrachalam

Srirama navami celebrations in telugu states

telngana, ap, bhadrachalam, ontemitta, sri rama, hindu, navami,

Rama Nawami is a Hindu festival, celebrating the birth of the god Rama to King Dasharatha and Queen Kausalya in Ayodhya. Rama, the seventh avatar of Vishnu, is the oldest known god having human form.he holy day falls in the Shukla Paksha on the Navami, the ninth day of the month of Chaitra in the Hindu calendar.

కన్నుల పండుగగా "శ్రీరామ నవమి"

Posted: 03/28/2015 08:16 AM IST
Srirama navami celebrations in telugu states

తెలుగు రాష్ట్రాలలో శ్రీ రామనవమి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. భద్రాద్రిలో నేడు సీతాకల్యాణానికి సర్వం సిద్ధమైంది. చైత్రశుద్ధ నవమిని పురస్కరించుకుని ఉదయం 10:30 గంటలకు శ్రీ రామకల్యాణం జరుగుతుంది. అంతకు ముందు ఉదయం 8 నుండి 9 గంటల మధ్య ధ్రువ మూర్తుల కల్యాణం జరుగుతుంది. 9 నుండి 9:30 వరకు కల్యాణముర్తుల అలంకరణ ఉంటుంది. ఆ తర్వాత 9 : 30 నుండి 10 : 30 గంటల వరకు కల్యాణ మండపానికి ఊరేగింపు సాగుతుంది. 10:30 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. తిరువారాధన, రాజభోగం, ప్రసాద వినియోగం ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సీతారాములకు పట్టువస్త్రాలు. తలంబ్రాలను సమర్పిస్తారు. ఇందుకోసం కేసీఆర్ శుక్రవారమే భద్రాద్రి చేరుకున్నారు. భద్రాద్రిలో నేటి రాత్రి చంద్రప్రభావాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుంది.

అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కల్యాణోత్సవాలకు భద్రాద్రిని శోభాయమానంగా అలంకరించారు. భద్రాచలం పట్టణం అంతా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. గుడి సమీప ప్రాంతాలలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి ఎదుర్కోళ్ల వేడుక జరిగింది. కాగా రేపు శ్రీ రామ మహాపట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఇందులో రాష్ట్ర గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ పాల్గొంటారు. రామనవమి ఉత్సవాలకు పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ 829 బస్సులు నడుపుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట రామాలయం కూడా శ్రీ రామనవమి వేడుకలకు ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. అక్కడ ఏప్రిల్ 2న సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఏప్రిల్ 6 వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.  శ్రీ రామ నవమి ఉత్సవాల సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నేడు నవమి ఆస్థానం జరుగుతుంది. ఈ దృష్ట్యా ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏప్రిల్ 2 నుండి 4 వరకు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు సాగుతాయి. వసంతోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు ఉండవు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telngana  ap  bhadrachalam  ontemitta  sri rama  hindu  navami  

Other Articles