Janareddy fire on telagana govt for job notifications

janareddy, notifications, jobs, telanagana, assembly, veccancies

janareddy fire on telagana govt for job notifications. in telanagana assembly sessions senior congress leader janareddy fire on govt. he said that students and unemployees are eagerly waiting for notifications. he questions and walkout from t assembly.

ఉద్యోగాలు ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పండి

Posted: 03/20/2015 12:39 PM IST
Janareddy fire on telagana govt for job notifications

తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగాయి. ఉద్యోగాల కోపం ఎదురు చూస్తున్న తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై సభ దద్దరిల్లింది. నిన్న నిరుద్యోగ జెఎసి చేపట్టిన ర్యాలీ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై  ప్రతిపక్షనేత కె.జానారెడ్డి  తెలంగాణ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగల సమస్యను లేవనెత్తారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆయన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కోరారు. అందుకు ఆయన సమాధానంపై జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటెల సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని తెలుపుతూ జానారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం నుండి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయని నమ్మిన విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు జానా.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని. అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని ఆయన లిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్న వస్తుందని పేర్కొన్నారు. సభలో జానారెడ్డి వ్యవహరిస్తున్న తీరును జీవన్‌రెడ్డి తప్పుబట్టారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janareddy  notifications  jobs  telanagana  assembly  veccancies  

Other Articles