In parliment sessions congress president soniagandhi on ap

sonia gandhi,congress, ap, parliament, venkiahnaidu, ups, nda, special status

in parliment sessions congress president soniagandhi on ap. sonia gandhi speech on ap at parliament that, the presvious upa govt promises to ap for special status, railway zone etc.

ఏపి మాట అమ్మ నోట.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

Posted: 03/17/2015 03:59 PM IST
In parliment sessions congress president soniagandhi on ap

ఏపి పునర్విభజపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. గతంలో యుపిఎ చేసిన వాగ్దానాలను కేంద్రం నెరవేర్చాలని సోనియా గాంధీ కోరారు. గతంలో తమ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, పలు జాతీయ సంస్థలు, పెట్రో యూనివర్సిటి లాంటి చాలా హామీలను ఇచ్చిందని వాటిని ఎన్డీయే ప్రభుత్వం అమలు చెయ్యాలని కోరింది. ఏపికి న్యాయం చెయ్యాలని గతంలో తాను ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశానని గుర్తు చేశారు. అయితే సభలో చాలా కాలం తరువాత సోనియా గాంధీ ఏపి పై పెదవి విప్పారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్న ఎన్డీయే సర్కార్ హామీలపై దృష్టి సారించడం లేదని ఆరోపించింది. తక్షణం ఏపికి ఇచ్చిన అన్ని హామీలను అమలు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పాటుపై 2001 నుండి 2014 వరకు కాంగ్రెస్ ఎందుకు ఆగిందని కాంగ్రెస్ ను ప్రశ్నించారు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు. ఏపి, తెలంగాణలకు కేంద్రం అండగా నిలుస్తుందని తెలిపారు. ఏపికి ఇచ్చిన హామీల్లో వెనక్కి తగ్గేది లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ లోటు ప్రతి రూపాయిని కేంద్రమే భరిస్తుందని వెంకయ్య నాయుడు వెల్లడించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  congress  ap  parliament  venkiahnaidu  ups  nda  special status  

Other Articles