Hot sessions going on at ap assembly for anganwadi

ysrcp, tdp, ap, assembly, sunitha, anganwadi, chandrababu, jagan

hot sessions going on at ap assembly for anganwadi. in ap assembly opposition leader ys jaganmohan reddy propose to discuss about anganwadi. minister peethala sunitha recounter on ysrcp.

ఏపి అసెంబ్లీలో అంగన్'వాడి' వేడి చర్చ

Posted: 03/17/2015 11:10 AM IST
Hot sessions going on at ap assembly for anganwadi

అంగన్ వాడీలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. ఏపి అసెంబ్లీలో అంగన్ వాడి లపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ అంగన్ వాడి సమస్యలపై స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే జగన్ వ్యవహారంపై అధికారపక్షం నుండి గట్టి సమాధానం వచ్చింది. ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రాజకీయ దురుద్దేశంతోనే సభను అడ్డుకుంటుందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత  ఆరోపించారు.  వైఎస్ఆర్ సీపీకి పనీ పాటా లేదని ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో సభను సజావుగా జరగనీయకుండా ఆ పార్టీ చూస్తుందని ఆమె విమర్శించారు. విజభన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారి జీత భత్యాలు పెంపునకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అంశంపై ఆలోచిస్తున్నారని పీతల సుజాత వెల్లడించారు. మంత్రి గారి మాటలతో అసుంబ్లీలొ  గందరగోళం నెలకొంది. మంత్రి ఆరోపణలను ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. దాంతో అసెంబ్లీలో వాతావరణం వేడెక్కింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  tdp  ap  assembly  sunitha  anganwadi  chandrababu  jagan  

Other Articles