Delhi cm arvind kejriwal said that he is not a nepolian who entered to win

aap, kejriwal, bangalore, delhi, arvind kejriwal, prashanth bhushan, yagender yadav

delhi cm arvind kejriwal said that he is not a nepolian who entered to win. Delhi chief minister Arvind Kejriwal’s silence these last few days has received as much attention as AAP’s bruising internal crisis. But in his naturopathy camp in faraway Bengaluru, the AAP chief isn’t wary of taking to people about the troubles ailing his party.

నేనేమీ నెపొలియన్ ను కాను: అరవింద్ కేజ్రీవాల్

Posted: 03/14/2015 12:44 PM IST
Delhi cm arvind kejriwal said that he is not a nepolian who entered to win

అఖండ మెజార్టీతో ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన ఆప్ పార్టీలో గత కొంత కాలంగా వివాదాలు చెలరేగుతున్నాయి. పార్టీలోనూ, ఆప్ కన్వీనర్ప ప్రస్తుత ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పై పలు ఆరోపణలు వచ్చాయి. పార్టీ కీలక పదవులనుండి యోగేంద్ర భూషణ్, ప్రశాంత్ భూషన్ లను తొలగించడం జరిగింది. రెండో సారి అధికారాన్ని చేపట్టేందుకు కేజ్రీవాల్ కాంగ్రెస్ ను చీల్చాలని ప్రయత్నించాలని చూసినట్లు తాజాగా ఆడియో టేప్ విడుదల అయింది. ఇలా ఆప్ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటే, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అనారోగ్య కారణాలతో బెంగళూర్ లో నేచురోపతి వైద్యం చేయించుకుంటున్నారు. పార్టీ వివాదాలపై మాట్లాడని కేజ్రీవాల్ పార్టీని రాజకీయాల్లో ఆప్ పనితీరు ఎలా ఉంటుందో కార్యకర్తలకు, అభిమానులకు వివరించారు.

ఢిల్లీలో ఎంతో కష్టపడి గెలిచామని, అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరించాలని భావిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే అన్ని సార్లూ గెలవడానికి తానేమీ నెపోలియన్ ని కాదని వివరించారు. రాజకీయాల్లో గెలుపు కోసం రాలేదని, రాజకీయ వ్యవస్థను మార్చడానికి తాము వచ్చామని వివరించారు. ఢిల్లీ ప్రజలకు ఎంతో నీతివంతమైన పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆప్ వివాదాలు, కేజ్రీవాల్ పై వచ్చిన వ్యక్తి ఆరోపణలు ఇలా వేటి గురించి ఆయన మాట్లాడలేదు.
  - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  bangalore  delhi  arvind kejriwal  prashanth bhushan  yagender yadav  

Other Articles