Crude bombs on a popular tamil television channel in chennai

Puthiya Thalamaurai, Hindu Munnani, thali, bombs, attack, media,

Unidentified persons on Thursday hurled crude bombs at the office of a popular Tamil television channel in Chennai, police said. The incident occurred at a time when the news channel Puthiya Thalamaurai was under attack by a right-wing fringe outfit, Hindu Munnani, for recording a controversial current affairs programme.

టీవీ చానల్ పై బాంబులతో దాడి

Posted: 03/12/2015 11:43 AM IST
Crude bombs on a popular tamil television channel in chennai

తమిళనాడులోని ప్రముఖ టీవీ చానల్ కార్యాలయం పై గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులుతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు టిఫిన్ బ్యాక్సుల్లో ప్యాక్ చేసిన బాంబులను టీవీ ఆఫీస్ పైకి విసిరారని చెప్పారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదని పుతియా తలైమురై చానల్ జర్నలిస్టులు తెలిపారు. వివాదస్పద కార్యక్రమం 'తాళి' ని ప్రసారం నేపథ్యంలో ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై సంస్థ ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా టీవీ సామాగ్రిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వీడియో జర్నలిస్టులపై దాడికి దిగారు. దాడి సందర్భంగా ఓ వీడియో కెమెరా ను నాశనం చేసినట్లు టీవీ ఛానల్ పేర్కొంది.

టీవీ ఛానల్ పై దాడిని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పత్రికలకు, టీవీ ఛానళ్లకు భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఏ కతనాలనైనా ప్రసారం చెయ్యవచ్చునని సీనియర్ జర్నలిస్ట్ లు పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఏవైనా కథనాలు ప్రసారమవుతున్నాయనుకుంటే కోర్టులను ఆశ్రయించాలి, కానీ ఇలా దాడికి దిగడం మంచిది కాదు అని వారు హితవు పలుకుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు మొదలయ్యాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puthiya Thalamaurai  Hindu Munnani  thali  bombs  attack  media  

Other Articles