Lok sabha passes amended land acquisition bill

loksabha, Land Acquisition Bill, the Central government, amendments, congress, shivasena, nda, tdp, trs,

The Lok Sabha passed the Land Acquisition Bill on Tuesday after the Central government brought in nine official amendments and added two clauses to the legislation. The Opposition, however, moved 52 amendments of its own. While one of the amendments limited the industrial corridor to 1km on both sides of highways and railway lines, another amendment guaranteed compulsory employment to one member of each family hit by the acquisition of their land.

లోకసభలో బిల్లు ఓకే.. మరి రాజ్యసభలో??

Posted: 03/11/2015 08:49 AM IST
Lok sabha passes amended land acquisition bill

మోదీ సర్కారు పట్టుబట్టి తీసుకొస్తున్న భూసేకరణ బిల్లు ఒక మెట్టు దాటింది. విపక్షాలను సంతృప్తి పరిచే ప్రయత్నంలో భాగంగా రైతులకు, నిర్వాసితులకు అనుకూలంగా 9 సవరణలను ప్రభుత్వమే చేసింది. విపక్షాలు చేసిన సవరణలు మాత్రం ఓటింగ్‌లో వీగిపోయాయి.  ప్రతిష్ఠాత్మకమైన ఈ బిల్లుకు రాజ్యసభలో మాత్రం గండం పొంచి ఉంది. సొంతంగా బిల్లును గెలిపించుకునేంత బలం లేకపోవడంతో... ఇతర పక్షాల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది.  ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న లోక్‌సభలో భూసేకరణ సవరణ బిల్లు అనుకున్నట్లుగానే గట్టెక్కింది.  ఓటింగ్‌ సందర్భంగా ఎన్డీయే పక్షాలుసహా మరిన్ని పార్టీల మద్దతు కోసం ప్రభుత్వం మెట్టు దిగివచ్చింది. ప్రతిపక్షాల సవరణల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని 9 సవరణలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓటింగ్‌ సందర్భంగా బీజేడీ వాకౌట్‌ చేసింది. అకాలీదళ్‌, శివసేన, టీడీపీవంటి మిత్ర పక్షాలు వ్యతిరేకించకపోవడంతో ప్రభుత్వ పరువుదక్కింది. టీఆర్‌ఎస్‌ కూడా బిల్లుకు మద్దతు పలికింది.

 
లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో బిల్లును ప్రభుత్వం నెగ్గించుకుంది. అయితే ఒక్క బీజేపీకే కాదు, మొత్తం ఎన్డీయేకే రాజ్యసభలో మెజారిటీ లేదు. ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండడమే కాక, ఐక్యంగా ఉండడంతో బిల్లుకు అసలు పరీక్ష రాజ్యసభలోనే ఎదురుకానుంది. యూపీఏలోనూ, ఎన్డీయేలోనూ లేని విపక్ష పార్టీల మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజ్యసభలో కూడా బిల్లును ఈ వారంలోనే ఆమోదింపచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌, ఏఐఏడీఎంకే పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినందున రాజ్యసభలోనూ మద్దతు పలుకుతాయని భావిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేడీ తదితర పార్టీలను ఒప్పించే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలా గనక జరిగితే మోదీ సర్కార్ భూసేకరణ బిల్లును విజయవంతంగా చట్టంగా మార్చే అవకాశం కలుగుతుంది. లేని పక్షంలో బిల్లు అట్టకెక్కుతుందని అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : loksabha  Land Acquisition Bill  the Central government  amendments  congress  shivasena  nda  tdp  trs  

Other Articles