Governor narasimhan speech in telangana assembly

Telangana assembly buget sessions, governer speech in Telangana assembly, Telugu states Assembly budget sessions begins today, Telugu states Assembly budget sessions from today, Telangana Assembly budget sessions begins today, Andhra pradesh Assembly budget sessions begins today, Andhra pradesh Assembly budget sessions from today, ap budget session, governor speech, Telangana assembly, Telugu desam party, TDP, YSRCP, TRS, Congress party, BJP, CPI,

governor narasimhan speech in Telangana assembly

కొత్త ఒరవడితో ముందుకెళ్ధాం.. ఆగని ఆందోళనలు

Posted: 03/07/2015 05:43 PM IST
Governor narasimhan speech in telangana assembly

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. అన్ని రంగాలలో కొత్త ఒరవడితో ముందుకెళ్తోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. విపక్షాల ఆందోళన మధ్య ఆయన తన  ప్రసంగాన్ని కొనసాగించారు.. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ చర్య తీసుకోవాలని కోరుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

*  మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. షాదీముబారక్ పేరుతో ముస్లిం యువతులకు వివాహ కానుక
*  వ్యవసాయంలో వృద్ధి బాగా లేకున్నా... అభివృద్ధి కొనసాగుతోంది.
*  రైతులకు అండగా ఉండేందుకు భూసార కార్డులు అందిస్తాం.
*  ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
*  ఉపాధి లేని వృద్ధులకు ఆసరా పథకం కొనసాగుతుంది
*  సేవారంగంలో 9.7శాతం వృద్ధి సాధించాం
*  కల్యాణలక్ష్మి కింద ఎస్సీ, ఎస్టీ యువతులకు ఆర్థికసాయం
*  గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం
*  వికలాంగులకు నెలకు రూ.1500 పింఛను అందిస్తున్నాం
*  భూమిలేని పేదలకు భూపంపిణీ చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం
*  నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధం
*  మహిళల రక్షణకు షీ టీమ్స్ పేరుతో ప్రత్యేకభద్రత
*  రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు తగిన చర్యలు
*  సామాజిక వనాల పెంపకానికి అధిక ప్రాధాన్యం
*  ప్రధాన నదుల నుంచి నీటివాటా కోసం నిరంతర ప్రయత్నం
*  అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి
*  సీఐడీ విచారణ అనంతరం గృహనిర్మాణ పథకానికి శ్రీకారం
*  ఉద్యోగుల సంక్షేమానికి ఆరోగ్యకార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్
*  రూ.20వేల కోట్లతో 46వేల పై చిలుకు చెరువుల పునరుద్దరణ
*  హైదరాబాద్‌లో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ
*  రాష్ట్రంలో 14 నగరాల్లో పారిశ్రామిక అభివృద్ధి
*  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.1.5కోట్ల నిధులు
* రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly budget sessions  Telangana  Governer Narasimhan  

Other Articles