Rahul speaks after along time

rahulgandhi, congress, speach, mulayam, samajcadiparty, kerala,speaker

Ten days after going on a sabbatical, Congress Vice President Rahul Gandhi on Saturday reached out to Samajwadi Party supremo Mulayam Singh Yadav ahead of the crucial week of Parliament.

పలుకే బంగారమాయెరా.. రాహుల్ బాబు

Posted: 03/07/2015 05:23 PM IST
Rahul speaks after along time

అంబ పలుకు జగదంబ పలుకు అంటే అమ్మ పలుకుతుందేమో కానీ గత కొన్ని రోజుల నుండి కనిపించకుండా పోయిన రాహుల్ గాంధీ మాత్రం ఏం పలకరు. అయితే రాహుల్ గాంధీ గురించి అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నా, స్వంత పార్టీ నేతలు కూడా రాహుల్ తీరుపై మండిపడ్డా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో రాహుల్ పలాయనం సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లాడు, ఎప్పుడు వస్తాడు ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నా, ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే మరో వారంలో రాహుల్ బాబు వస్తున్నారని కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేత ప్రకటించారు.

దేశంలో బడ్జెట్ గురించి, భూసేకరణ చట్టం గురించి ఇంత రాద్దాంతం జరుగతున్నా, కనీసం స్పందించని రాహుల్ బాబు తాజాగా ఓ విషయంలో మాత్రం స్పందించారు. స్పందించడం కాదు మంచి కూడా కోరుకున్నారు. అదేంటి రాహుల్ దేని గురించి మాట్లాడారు అనుకుంటున్నారా..సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ కు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రిలో చేరారు. అయితే ములాయం సింగ్ ఆరోగ్యం మెరుగుపడాలని, తిరిగి పూర్తి ఆరోగ్యంతో రావాలని రాహుల్ కోరుకున్నారు. మరో పక్క కేరళ స్పీకర్ మృతి చెండంపై కూడా రాహుల్ బాబు స్పందించారు. మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నట్లు, స్పీకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మొత్తానికి రాహుల్ బాబు ఇలా తన స్పందనను తెలియజేశాడు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahulgandhi  congress  speach  mulayam  samajcadiparty  kerala  speaker  

Other Articles