Contraversy goingon for the tpcc president

congress, tpcc, ponnal, ponnala, uttamkumar, malluravi, komatireddy,soniagandhi

contraversy goingon for the tpcc president. congress senor leader komatireddy venkatreddy announce that he will not coperate to uttamkumar. the highcommend of the congress make wrong second tome komatireddy sentensed.

పిసిసి నియామకంపై కొంత మోదం.. మరికొంత ఖేదం

Posted: 03/04/2015 08:53 AM IST
Contraversy goingon for the tpcc president

టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించి రెండోసారి అధిష్టానం తప్పు చేసిందని మాజీమంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ సంక్షోభ సమయంలో అందరినీ కలుపుకోగలిగే సమర్థవంతమైన నాయకుని కోసం అన్వేషించకుండా ఉత్తమ్ నియామకంపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోనని కోమటిరెడ్డి కుండబద్దుకొట్టారు. ముందుగా సీనియర్లతో చర్చించి ఉంటే ఇలాంటి తప్పుడు నిర్ణయం రెండోసారి జరిగేది కాదన్నారు. గత ఎన్నికల్లో పొన్నాలను నియమించి మొదటి తప్పు, ఈసారి ఉత్తమ్‌ను నియమించి రెండోసారి తప్పు చేసిందన్నారు. నల్లగొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా బత్తాయితోటలు నీరులేక ఎండిపోతున్నాయన్నారు. నీటి విడుదలకోసం మంత్రి హరీష్‌రావును కలిసినట్టుగా కోమటిరెడ్డి వెల్లడించారు.

మరో వైపు అధిష్టానం నిర్ణయాన్ని శిరసాహిస్తానని పొన్న ప్రభాకర్ వెల్లడించారు. మరో కాంగ్రెస్ నేత మల్లు రవి కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని గౌరవిస్తామని ప్రటించారు. కానీ ఉత్తమ్ కుమార్  కు అధిష్టానం పిసిసి అధ్యక్ష పదవిపై బాహాటంగా చెప్పలేని చాలా మంది కాంగ్రెస్ నాయకులు, చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఒక్క తెలంగాణలోనే కాకుండా దాదాపు ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తమ పార్టీ పగ్గాలను కొత్తగా మార్చింది. అయితే తెలంగాణ పిసిసిలో మాత్రం కొత్త పోరుకు తెరతీసింది కాంగ్రెస్ అధిష్టానం.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  tpcc  ponnal  ponnala  uttamkumar  malluravi  komatireddy  soniagandhi  

Other Articles