Sadhvi prachi sentenced sensationals words

sadhvi prachi, pm modi, vhp, khan cinemas, love jihad, salmankhan, amirkhan, shahrukh khan, dehradun

sadhvi prachi sentenced sensationals words. pm modi cleard that his govt will not support communal and regional violence. but bjp party leaders risisng some contraversial statments.

హిందువులు ఖాన్ ల సినిమాలు చూడవద్దు

Posted: 03/02/2015 08:57 AM IST
Sadhvi prachi sentenced sensationals words

మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ, కొందరు హిందూ నేతలు చేస్తున్న వివాద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. మదర్ థెరిస్సా పై మతపరమైన నేపథ్యం ఉందంటూ మోహన్ భగత్ చేసిన వ్యాఖ్యలు, అధికార పక్షానికి తీవ్ర తలనొప్పులనే తెచ్చిపెట్టాయి. రాజ్యసభలో కాంగ్రెస్, త్రుణముల్ కాంగ్రెస్, జెడియు, సమాజ్వాది పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. ఎలాగోలా చర్చ నుండి ఉపశమనం పొందినా, అలాంటి వ్యాఖ్యలను మాత్రం ఆపలేకపోతున్నారు మోదీ. పార్లమెంట్ సాక్షిగా దేశ సౌభ్రాతృత్వం మాకెంతో ముఖ్యమని ప్రకటించిన ప్రధాని మోదీ, మతపరమైన వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని అన్నారు. కానీ మోదీ మాటలను బేఖాతరు చేస్తు ఓ వర్గానికి అనుకూలంగా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.

బాలీవుడ్ ఖాన్ త్రయం లవ్ జిహాద్‌ను ప్రచారం చేస్తున్నారు. ఆ ఖాన్‌ల సినిమాలు హిందువులు బహిష్కరించాలి. వారి పోస్టర్లు ఇళ్లలో పెట్టుకోకూడదు. ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతీయ వధువునే పెళ్లాడాలి...బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రాచి ఇచ్చిన సలహాలివి. డెహ్రాడూన్‌లో జరిగిన వీహెచ్‌పీ సమావేశంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలను తన ప్రసంగంలో చేర్చారు. షారుఖ్ ఖాన్, సాల్మన్ ఖాన్, అమీర్‌ఖాన్ సినిమాల నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సిన ఉత్తమ సంస్కారాలేవీ ఉండవు. ఆ చిత్రాలు లవ్ జిహాద్‌కు మద్దతు తెలుపుతుంటాయి అని ఆమె చెప్పారు. దేశంలో హిందువుల జనాభా తగ్గిపోతున్నదని, మతాల మధ్య సమతుల్యత కోసం హిందువులు ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనాలని సాధ్వి అన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sadhvi prachi  pm modi  vhp  khan cinemas  love jihad  salmankhan  amirkhan  shahrukh khan  dehradun  

Other Articles