Finance minister jaitly positive responce about ap

Ap, Jaitly, Central, Budget, FinancialSupport, Chandrababu, Nda,NewState

finance minister jaitly positive responce about ap. andhra pradesh need more funds and grants from cenrtral govt. cm chandrababu naidu trying to get more possible funds.

ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. ఏపికి జైట్లీ అభయం?

Posted: 02/27/2015 12:50 PM IST
Finance minister jaitly positive responce about ap

కొత్త రాష్ట్రంగా ఏర్పడి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు విడుదల చెయ్యనున్న బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరుగుతాయని అందరు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఏపికి ప్ర్యతేక హోదా కల్పించడానికి ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం ఏపికి భారీగా నిధులను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ముందు నుండి ఎన్డీయే ప్రభుత్వంతో పొత్తును కొనసాగించిన చంద్రబాబు, కేంద్రం నుండి భారీగానే నిధులను రాబడతారని సమాచారం. అయితే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం కష్టం అని వెల్లడించారు. ప్రత్యేక హోదాకు అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలని ప్రకటించారు.

అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందు రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపిన,జైట్లీ ఏపికి ముందు ముందు మంచి రోజులు వస్తాయని చెప్పడంలో ఇదే అర్థం ఉందని అనుకుంటున్నారు. కాగా కేంద్రం నుండి భారీగా నిధులను ఆశిస్తున్నారు. మొత్తానికి ఏపి అడిగినంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా తేలాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఏపికి నిధులను తీసుకురావడంలో విఫలమైందని ఇప్పటికే కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనూ  ఏపిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది బిజెపి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Jaitly  Central  Budget  FinancialSupport  Chandrababu  Nda  NewState  

Other Articles