Drug rocket related to telugu cinema industry

drug, drug mafia, drug rocket, telugu industry, cocaine, nigerians

drug rocket related to telugu cinema industry. police arrested a telugu young director and producer while purchasing drugs in hyderabad. police announce that the nigerians supply the drugs to celebraties.

డ్రగ్ రాకెట్ తో సినిమా పరిశ్రమకు సంబందాలు.. వెల్లడించిన పోలీసులు

Posted: 02/26/2015 01:25 PM IST
Drug rocket related to telugu cinema industry

డ్రగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిన ప్రతి సారి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరి పేర్లు బయటికి రావడం తర్వాత ఆ ఊసు లేకుండా పోవడం మామూలే. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్‌లతో పాటు ఓ సినీ దర్శకుడు, నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజలు క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువ నిర్మాత సుశాంత్ రెడ్డి, దర్శకుడు రవికుమార్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి నైజీరియా దేశానికి చెందిన సుల్తాన్, శ్యాంసన్ ఏ బూపా, ఉజర్ ప్రామిస, అటూబఖ్ బోషాను అరెస్టు చేశారు. వారి నుంచి వారి వద్ద నుంచి 90 గ్రాముల కొకైన్, తొమ్మిది ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్‌ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.

కొంత కాలంగా నైజీరియా దేశస్థుల వద్ద మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ సినీ పరిశ్రమలోని పలువురికి అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు విక్టర్, ప్యాక్రిక్ పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని సైతం అరెస్టు చేస్తామని చెప్పారు. చదువు ముసుగులో నగరంలో నివసిస్తున్న నైజీరియన్లు.. ముంబాయి, గోవ వంటి ప్రదేశాల నుంచి మాదకద్రవ్యాలను నగరానికి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సమావేశంలో ఏసిపి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. మొత్తానికి సినిమా పరిశ్రమకు చెందిన వారు ఇలా డ్రగ్ మాఫియాలో ఓ భాగంగా ఉండటం సినిమా ప్రపంచానికి చెడ్డపేరు తెస్తోంది.
-  అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drug  drug mafia  drug rocket  telugu industry  cocaine  nigerians  

Other Articles