Ramanaidu death film political leaders condolences

ramanaidu death news, chiranjeevi news, chandrababu naidu news, cm kcr news, venkaiah naidu news, ys jagan news

ramanaidu death film political leaders condolences : Cine and Political members condolences on ramanaidu death.

రామానాయుడి మృతిపై సినీ-రాజకీయ ప్రముఖుల సంతాపం

Posted: 02/18/2015 07:03 PM IST
Ramanaidu death film political leaders condolences

గతకొన్నాళ్ల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మూవీ మోఘల్ డాక్టర్ డి.రామానాయుడు.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇంత ఆకస్మికంగా ఈయన మృతిచెందడంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి చెందింది. అలాగే పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు : తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. రామానాయుడు శతాధిక చిత్రాలు నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. చివరగా ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ : రామానాయుడు వందకుపైగా సినిమాలు నిర్మించి ప్రపంచరికార్డు నమోదు చేశారు. చిత్రపరిశ్రమను హైదరాబాద్ తెచ్చేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు.

వెంకయ్యనాయుడు : జీవితంలో క్రమశిక్షణ, అంకితభావం వుంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని రామానాయుడు నిరూపించారు. ఏ పనినైనా ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఆయన తీసినన్ని చిత్రాలు ఎవరూ తీయలేదు. ఎందరో తారలను పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపిన వెంకయ్య.. తెలుగుప్రజల మనసుల్లో రామానాయుడు చిరస్థాయిగా నిలిపోతారని అన్నారు.

జగన్ : ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచి, మనసున్న మనిషిగా సినీ పరిశ్రమలో అందరి ఆదరాభిమానాలను చూరగొన్న వ్యక్తి రామానాయుడు. ఆయన మృతి చెందారన్న వార్త తెలియగానే దిగ్ర్భాంతికి లోనయ్యాను. ఆయన మరణం ఎంతో బాధకు గురి చేసింది. ఎంత ఎదిగినా, ఒదిగి వుండే తత్వం రామానాయుడిది!

మురళీమోహన్ : రామానాయుడు మరణించడం చాలా దురదృష్టకరం. అన్ని భాషల్లో చిత్రాలు తీయడం మామూలు విషయం కాదు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది. ఇండస్ట్రీలో ఆయనలాంటి నిర్మాత మరొకరు లేరు.

కృష్ణ : రామానాయుడు మృతిచెందడం చాలా బాధాకరం. ఆయనతో నాకు 48 ఏళ్ల అనుబంధం. ఆయన నాతో ఎంతో చనువుగా వుండేవారు. రామానాయుడు నిర్మాతగా ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించానని గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి : రామానాయుడు గారికి సినిమానే ఊపిరి. ఆయన ఏనాడూ నన్ను పేరుతో పిలవలేదు. కలిసిన ప్రతిసారీ రాజా అంటూ ఆప్యాయత చూపించేవారు. సినిమాయే లోకంగా ఆయన జీవించారు. ఆయనకు సినిమానే జీవితం, సర్వస్వం అని పేర్కొన్నారు. ఆఖరి శ్వాసవరకు సినిమాలు తీస్తుంటానని రామానాయుడు అనేవారని చిరు గుర్తు చేసుకున్నారు.

దాసరి నారాయణరావు : చిత్రపరిశ్రమలో రామానాయుడు లేని లోటు పూడ్చలేము. ఆయన మృతిపట్ల సంతాపసూచకంగా రేపు చిత్రపరిశ్రమ బంద్ పాటిస్తుంది. థియేటర్లు కూడా బంద్ పాటిస్తాయని దాసరి అన్నారు.

నందమూరి కుటుంబసభ్యులు : జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ తదితరులు రామానాయుడు భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయనలాంటి నిర్మాత ఇండస్ట్రీలో మరొకరు లేరని తెలిపారు. బాలయ్య కూడా ఆయన మృతిపట్ల విచారకరం తెలిపారు.

నాగార్జున : రామానాయుడి పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇలా ఈ విధంగా ఇంకా ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు రామానాయుడు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.  అలాగే హీరోయిన్లు కూడా ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం విచారకరం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramanaidu death news  tollywood condolences  

Other Articles