Errabelli dayakar rao comments kcr

errabelli dayakar rao latest news, cm kcr latest news, errabelli kcr latest news, telangana ministers, andhra pradesh ministers

errabelli dayakar rao comments kcr : tdp minister errabelli dayakar rao controversial comments on cm kcr

‘కేసీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు’

Posted: 02/18/2015 04:28 PM IST
Errabelli dayakar rao comments kcr

ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనలను ముగించుకుని వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్... ఇంకా సేద తీర్చుకున్నారో లేదో తెలియదు కానీ విమర్శల పర్వం మాత్రం భారీగా కొనసాగుతోంది. టీడీపీ మంత్రులు వరుసబెట్టిమరీ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ పర్యటనపై టీ సీఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యలు చేయగా.. ఆ మరుక్షణమే టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శల వర్షం కురిపించారు.

అసలు మహారాష్ట్ర పపర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ సాధించిందేముందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాల్లో కీలకమైన బాబ్లీ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్ర సీఎంతో కేసీఆర్ చర్చ జరపకపోవడంపై చాలా దారుణమని అన్నారు. తెలంగాణాలో వున్న ప్రజలందరూ విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే, రాష్ట్రంలో అసలు విద్యుత్ కోతలే లేవంటూ కేసీఆర్ సిగ్గు లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఇదిలావుండగా.. విద్యుత్ కోతలు వున్నాయంటూ గతంలో రైతులు కేసీఆర్ పై వ్యతిరేక నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే! విద్యుత్ లేకపోవడం వల్ల తమ పంటపొలాలకు నీళ్లు సప్లై సౌకర్యం లభించకపోగా పంటలు నాశనమవుతున్నాయని ఎందరో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మాటలనే మరోసారి ఎర్రబెల్లి గుర్తుచేస్తూ.. పై విధంగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao  kcr latest news  

Other Articles