Pak officials arrest peshawar killers

peshawar, peshawar school, attack on pak school, 140 children dead, terror attack on children

pak officials arrest peshawar killers : pakistan army officials announce that they arrest some of the terrorists who attacked on peshawar school on last 14 dec.

నరమేధం చేసిన వాళ్లను వదలం... పాక్

Posted: 02/13/2015 01:06 PM IST
Pak officials arrest peshawar killers

డిసెంబర్ 16, 2014 ప్రపంచ చరిత్రను రక్తంతో రాసిన రోజు. ఆ రోజు మానవ సమాజం మొత్తం సిగ్గుతో తల దించుకునేట్లు చేసింది పెషావర్ స్కూల్ నరమేధం.  ముక్కుపచ్చలారని చిన్నారులను అతి కర్కషంగా హత మార్చిన ఘటనపై యావత్ ప్రపంచం ఖండించింది. పాకిస్థాన్ చరిత్రలోనే కాదు ప్రపంచంలో కనీవినీ ఎరుగని మారణహోమం. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఈ నరమేధంలో పాల్గొన్న 9 మంది తీవ్రవాదులు ఇప్పటికే సైన్యం చేతిలో చనిపోయారని తెలిపారు. అలాగే పాక్, ఆఫ్ఘానిస్థాన్లకు చెందిన 12 మంది తీవ్రవాదుల కోసం గాలింపులు సాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ దాష్టికానికి పాల్పడిన 12 మందిని అప్పగించాలని ఆప్ఘన్ ను కోరినట్లు తెలిపారు.

జిహాద్ పేరుతో చేస్తున్న అరాచకానికి మరో రక్త చరిత్ర పెషావర్ ఘటన. తమ ఉద్యమానికి అడ్డుకుంటున్న ఆర్మీ అధికారులకు కడుపుకోతను మిగిల్చిన ఘటన అది. ఎందరొ తల్లుల కంట రక్తాన్ని పారించిన దారుణ ఘటన. 140 మంది చిన్నారుల బంగారు కలలను ఒక్క బుల్లెట్ తొ చెరిపివేశారు తీవ్రవాదులు. ఈ దారుణానికి వ్యూహారచన చేసిన తేహ్రిక్, తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్లను  త్వరలో పట్టుకుంటామని ప్రకటించారు. పెషావర్ స్కూల్పై దాడికి తీవ్రవాదులు పాక్ ,ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో వ్యూహాన్ని రచించారని పాక్ అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ఘటనకు సూత్రధారులు తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్గా పాక్ దర్యాప్తులో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles