Aap targeting banglore

The Bangalore, aap, aam admi party, kejriwal, delhi elections, aap in banglore

aap targeting banglore : after big voctory aap focus on banglore. aap choose banglore very sharp. from the begining aap focus on delhi andalso banglore.

ఢిల్లీ అయిపోయింది...ఇక బెంగళూర్: ఆప్ నేతల ఆలోచన

Posted: 02/13/2015 10:32 AM IST
Aap targeting banglore

ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బెంగళూర్ పై కన్నేసింది. ఢిల్లీ మాదిరిగానే బెంగళూర్ లోనూ తమ పార్టీ జెండాను నాటాలని ఆప్ నేతలు నిర్ణయానికి వచ్చారు. దేశ రాజధానిలో భాజపాకు చమటలు పట్టించిన ఆప్ నాయకులు మరోసారి భాజపాకు గట్టిపట్టున్న రాష్ట్రాన్ని టార్గెట్ చెయ్యడం ఆ పార్టీని కొంత కలవరపెడుతోంది. ఆప్ నాయకులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, బెంగళూర్ లో తమ పార్టీకి గల సానుకూల అంశాలపై వారు చర్చించారని సమాచారం.

ఢిల్లీ తరహాలోనే బెంగళూర్ లో అక్షరాస్యులు ఎక్కువ. అందునా ఐటి రంగానికి బెంగళూర్ పెట్టింది పేరు. ఇవే అంశాలను తనకు అనుకూలంగా మార్చుకొని బెంగళూర్ ను తన హస్తగతం చేసుకోవాలని చూస్తోంది ఆప్. ముఖ్యంగా యువత జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంటుందో, దిగువ మధ్య తరగతికి చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఆప్ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆప్ బెంగళూర్ ను ఎంచుకుంది. ఆప్ కు ఢిల్లీ తరువాత గట్టి మద్దతు లభించే ప్రాంతంగా బెంగళూర్ ను భావిస్తోంది. ఆప్ ఆవిర్భావం నుండి బెంగళూర్ పట్టణంతో అనుబందం కొనసాగుతోంది. అదే సెంటిమెంట్ తో ప్రస్తుతం ఆప్ ను బెంగళూర్ లో బలోపేతం చెయ్యాలని తీర్మానించింది. ఆప్ వ్యూహాలు బెంగళూర్ ను ఎంత వరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Bangalore  aap  aam admi party  kejriwal  delhi elections  aap in banglore  

Other Articles