Reduce the rate of eveteasing by she teams

she teams, eveteasing, hyderabad police, telanagana police

reduce the rate of eveteasing by she teams : in syberabad and hyderabad eveteasing cases count less than past. police officials want to introduce the she teams to all telanagan dists.

షీ టీమ్స్ ఇన్...ఈవ్ టీజింగ్ ఔట్

Posted: 02/09/2015 11:30 AM IST
Reduce the rate of eveteasing by she teams

అమ్మాయిలు ఒంటరిగా కనబడితే ఆటపట్టించేస్తుంటారు ఆకతాయిలు. ఈవ్ టీజింగ్ కారణంగా ఎంతో మంది అమ్మాయిల జీవితాలు తెల్లారిపోయాయి. తమ చిన్నారి భవితను చూసి గర్వింద్దామనుకున్న ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిలాయి. ఇలాంటి ఎన్నో ఘటనలకు అడ్డుకట్ట వెయ్యాలని, భవిష్యత్తులో ఏ ఒక్క అమ్మాయి ఈవ్ టీజింగ్ బారిన పడకుండా చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం షీ బృందాలను ప్రవేశపెట్టాయి. మహిళా పోలీసులు షీ బృందాల్లో ఉంటూ, వాటిని వారే మానిటర్ చేసుకుంటారు. షీ బృందాల ఏర్పాటు తర్వాత చాలా మంది తమ చుట్టు జరుగుతున్న ఈవ్ టీజింగ్ పై వీడియోతో సహా ఆధారాలు పంపారు. తర్వాత ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగిపోతుంది.

ఇలా ఆగతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సైబదాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీంలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. హైదరాబాద్ , సైబరాబాద్ పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటు తర్వాత ఈవ్ టీజింగ్ కేసులు 85 శాతం తగ్గాయి. గత మూడు నెలల్లో 550 మంది ఆకతాయిలను వీడియో ఆధారాలతో సహా షీ టీంలు పట్టుకున్నాయి. ఫలితంగా ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఇదే స్పూర్తితో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ షీ టీంలను ఏర్పాటు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : she teams  eveteasing  hyderabad police  telanagana police  

Other Articles