Police inspector commits suicide

police inspector commits suicide, kothwali police station, police inspector, commits suicide, madya pradesh, sungrali district,

kothwali police station inspector bodhariya commits suicide in madya pradesh sungrali district

సర్వీస్ రివాల్వర్ తో సిఐ ఆత్మహత్యకు కారణాలేమిటీ..?

Posted: 02/08/2015 08:14 PM IST
Police inspector commits suicide

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సుంగ్రాలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్వాలిలో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ ఎస్ భదోరియా(58) పోలీస్ స్టేషన్ లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పూనుకున్నాడు. మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది.
 
తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన ఇన్ స్పెక్టర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్పీ డీకే చక్రవర్తి తెలిపారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించినట్లు స్పష్టం చేశారు. మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయాల్సిన భదోరియా తెలియరాలేదు. భదోరియా మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు పంపిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ వ్యవహారాల పరిణామాల నేపథ్యంలోనే ఇన్ స్పెక్టర్ ఆర్ ఎస్ భదోరియా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.
.
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police inspector  commits suicide  madya pradesh  

Other Articles