Karwan ex mla afsar khan died

karwan ex mla afsar khan passed away, afsar khan passed away due to ill health, karwan ex mla afsar khan, afsar khan suffered chest related disease, afsar khan dies in apollo hospital,

karwan ex mla afsar khan passed away due to ill health

ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ కన్నుమూత

Posted: 02/06/2015 10:26 AM IST
Karwan ex mla afsar khan died

కార్వాన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం సీనియర్ నేత ముఖ్తదా అఫ్సర్‌ఖాన్ (61) శుక్రవారం మృతిచెందారు. ఛాతీ సంబంధ వ్యాధితో బాధపడుతన్న ఆయన పదిహేను రోజులుగా జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం తెల్లవారుజామున కన్నుముశారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన అక్కడి ప్రజలు మెచ్చిన నేతగా అయన ఎదిగారు.
 
ఎంఐఎం పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న అఫ్సర్‌ఖాన్ ఆ పార్టీ ముఖ్యనేత అక్బరుద్దీన్ ఒవైసీకి సన్నిహితుడు. పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవారు. గతంలో బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ బషీర్‌బాగ్‌కు వచ్చిన సందర్భంలో చెప్పుల మాలవేసి తన నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అబిడ్స్ కార్యాలయం ముందు జరిగిన అల్లర్లలో తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ex mla afsar khan  illness  died  apollo hospital  

Other Articles