Priest suicide note goes viral on facebook

priest suicide note goes viral, priest suicide note viral on facebook, chitoor priest sucide note, sucide note in facebook, chitoor priest goes missing, chitoor police files sumoto case, chitoor priest with shiridi sai photo, chitoor priest shivaswamy, chitoor priest his wife both missing, chitoor priest missing, temple committee abused chitoor priest, chitoor priest shivaswamy facebook

Madanapalle priest suicide note on facebook doing halchal.

కలకలం రేపుతున్న పూజారి సూసైడ్ నోట్..!

Posted: 02/01/2015 04:34 PM IST
Priest suicide note goes viral on facebook

హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ వ్యాపారి కుటుంబం తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ తన సోదరుడికి సూసైడ్ నోట్ రాసి వెళ్లిన ఘటనను మర్చిపోకముందే.. అదే తరహాలో మరో సూసడ్ నోట్ చిత్తూరులో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ పూజారి సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్‌ను పెట్టి అదృశ్యమయ్యాడు. దీనిపై సుమోటో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పూజారి దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే... చిత్తూరు పట్టణంలోని బర్మావీధిలో ఉన్న షిరిడిసాయిబాబా మందిర ప్రధాన అర్చకుడు శివస్వామి, తన భార్య జ్యోతితో కలిసి నాలుగురోజుల కిందట అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో శివస్వామి సూసైడ్‌నోట్ వెలుగు చూసింది. ఆలయ ధర్మకర్తలు మందలించిన కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూజారి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను పూజించే సాయిబాబా విగ్రహంతో కలసి ఫొటో తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు ధర్మకర్తలు దూషించారని ఆయన ఆ నోట్‌లో తెలిపాడు. ఈ విషయాన్ని చిత్తూరు టుటౌన్ పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిప్పిలిలో ఉన్న పూజారి శివస్వామి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priest  suicide  facebook  chittoor  

Other Articles