Delhi elections people support aravind kejriwal aam admi party news

aravind kejriwal, delhi elections, bjp party news, aam admi party news, delhi people, delhi elections news, shiela dixit news, bjp party delhi elections

delhi elections people support aravind kejriwal aam admi party news : According to a channel opinion poll.. Delhi people supporting aam admi party. They thinking that Aravind Kejriwal is better cm for Delhi.

ఢిల్లీ పీఠాధిపతిగా కేజ్రీవాలే ఎంతో బెటరట..?

Posted: 01/18/2015 10:33 AM IST
Delhi elections people support aravind kejriwal aam admi party news

ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ ఎన్నికల్లో అజేయంగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. 49 రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పీఎం పదవి కోసం ఆశపడి మోడీని ఢీకొట్టాలనే ప్లాన్ రచ్చరచ్చ చేసేశారు. అంతే! ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ భారీ ఓట్లతో గెలుపొందిన అనంతరం కేజ్రీవాల్ అడ్రస్ లేకుండా పోయారు. తాను ఎంతో కష్టపడి సాధించిన ఇమేజ్ ఒక్కసారిగా మట్టిలో కొట్టుకుపోయింది. ఎన్నిప్రయత్నాలు చేసినా.. ప్రజల నుంచి అంతగా ఆదరణ దక్కలేదు. దీంతో ఆయన మీడియా ముందుకు రాకుండా కొన్నాళ్లపాటు మౌనం పాటించారు.

అయితే ఇంతలోనే ఆయన ఏం చేశారో ఏమో తెలియదు కానీ.. మళ్లీ అతని స్టార్ ఇమేజ్ ఢిల్లీలో వెలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమను కేజ్రీవాల్ మోసం చేసి నిండా ముంచారని పెదవి విరిచిన ఢిల్లీ ప్రజలు.. ఇప్పుడు ఆయనను ఢిల్లీ పీఠాధిపతిగా మరోసారి చూడాలని ఆశపడుతున్నారట! ఇది వినడానికి చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ వున్నా.. ఇది మాత్రం నిజం! ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే సరైన వ్యక్తి అంటూ అత్యధిక ఓటర్లు భావిస్తున్నారని సమాచారం! దీంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కేజ్రీ ‘క్రేజీ’గా గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చర్చలు కొనసాగిస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికలపై ఓ ఛానెల్ తాజాగా ఒపీనియన్ పోల్’ను నిర్వహించింది. అందులో ఆ ఛానెల్ మొత్తం 6,414 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించగా.. అందులో దాదాపు 54 శాతం మంది ఓటర్లు కేజ్రీవాల్ సీఎం అయితేనే అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేత-కేంద్రమంత్రి హర్షవర్ధన్’కు 29 శాతం, ఆ పార్టీ మరో నేత జగదీష్ ముఖికి 3 శాతం, కాంగ్రెస్ నేత-ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్’కు 5 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. ఈ పోల్ విషయాన్ని కాస్త పక్కనపెడితే... ఢిల్లీ ప్రజలు చాలావరకు కేజ్రీవాల్’నే సీఎంగా మరోసారి చూడాలని కోరుతున్నారని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. మరి.. ఎన్నికల తర్వాత పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravind Kejriwal  Delhi elections  bjp party news  

Other Articles