Tirupati assembly by elections to be held on 13 february

tirupati Assembly by elections, tirupati Assembly by elections on february 13, tirupati Assembly by elections counting on february 16, Bharatiya janatha party, congress party, Telugu desham party, YSR congress party, chief election commissioner, Chief Election Commissioner, VS Sampath, tirupati Assembly by elections shedule released, tirupati Assembly by elections notification on january 19, tirupati Assembly by elections nominations last date january 27, tirupati Assembly by elections withdrawls january 30,

tirupati Assembly by elections will be held on February 13

తిరుపతి అసెంబ్లీకి ఫిబ్రవరి 13న ఉప ఎన్నికలు

Posted: 01/12/2015 08:08 PM IST
Tirupati assembly by elections to be held on 13 february

తిరుపతి అసెంబ్లీకి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గత ఏడాది అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ వీఎస్ సంపత్.. ఆ తరువాత తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్డ్ ను విడుదల చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 13 ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇందుకు గాను నోటిఫికేషన్ ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ను ఫిబ్రవరి 16న చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే తిరుపతి అసెంబ్లీకి ఉప ఎన్నికల నేపథ్యంలో గతం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. వెంకటరమణ వారసులకు అధికార టీడీపీ ప్రభుత్వం టిక్కెట్ ఇచ్చిన పక్షంలో వైసీపీ పోటిలో నిలవదు. ఈ ఉపపోరులో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఇంకా స్పష్టత రాలేదు. అయితే తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

  • నోటిఫికేషన్- జనవరి 19
  • నామినేషన్లకు చివరి తేదీ- జనవరి 27
  • నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 30
  • ఎన్నికలు- ఫిబ్రవరి 13
  • కౌంటింగ్-  ఫిబ్రవరి 16


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirupati assembly  assembly elections  13th february  vs sampath  

Other Articles