Telangana groups exams syllabus changes

Telangana Publice Service Commission, Telangana groups syllabus changed, telangana groups exams new syllabus, telangana exams new syllabus, telangana government jobs, telangana updates, telangana jobs, telangana latest, Latest job notifications

Telangana groups exams syllabus changes : soon Telangana State Public Service Commission going to change syllebus of groups exams. In the place of Ap History and AP economy and Ap geography telangana syllabus will be replaced.

తెలంగాణ గ్రూప్స్ పరీక్షల సిలబస్ మార్పు

Posted: 01/09/2015 04:47 PM IST
Telangana groups exams syllabus changes

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే వేగంగా పని చేయటం ప్రారంభించింది. కమిషన్ సలహా కమిటీ సభ్యులు ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ, సిలబస్ పై నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ గ్రూప్స్ పరీక్షల సిలబస్ లో మార్పులు చేసినట్లు ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. నిపుణుల కమిటీ చైర్మన్ గా ఉన్న హరగోపాల్, మున్ముందు ఏపీకి సంబంధించిన అంశాలు సిలబస్ లో ఉండవన్నారు. 2017 నాటికి ఏపీ చరిత్ర, అర్ధశాస్ర్తం, భౌగోళిక శాస్ర్తం స్థానంలో తెలంగాణ చరిత్ర, అర్థశాస్ర్తం, భూగోళిక శాస్ర్తంను చేరుస్తామన్నారు.

దీనిపై వీలైనంత త్వరలోనే కమిషన్ కు నివేదిక అందిస్తామన్నారు. అటు విద్యార్థులు ఎవరూ సిలబస్ మార్పులపై ఆందోళన చెందవద్దన్నారు. అందరికి న్యాయం జరిగే విధంగానే సిలబస్ మార్పు ఉంటుందని హామి ఇచ్చారు. తాము కమిషన్ కు కేవలం సూచనలు మాత్రమే ఇస్తామని తుది నిర్ణయం తీసుకునేది తెలంగాణ పబ్లి్ సర్వీస్ కమిషన్ మాత్రమే అని స్పష్టం చేశారు.

హరగోపాల్ తాజా ప్రకటనతో గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పుడు ఏపీ చరిత్ర చదవాలా? లేక తెలంగాణ చరిత్ర చదవాలా తెలియటం లేదని వాపోతున్నారు. అదేవిధంగా.., కొత్త నోటిపికేషన్లు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవటంతో, ఎన్నాళ్ళు ఇంకా వేచి చూడాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు ప్రస్తుత విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని హామి ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Public Service Commission  groups exams  government jobs  

Other Articles

Today on Telugu Wishesh