Mahesh babu new year resolution to quit smoking

mahesh babu to quit smoking, price mahesh quits smoking, tolly wood hero mahesh quits smoking, mahesh stops smoking, mahesh new year resolution, mahesh sets example to his fans

tolly wood hero mahesh babu had taken a resolution new year day to quit smoking

మంచి నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు.!

Posted: 01/01/2015 08:26 PM IST
Mahesh babu new year resolution to quit smoking


ప్రతీ నూతన సంవత్సర వేళ అందరూ ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తెల్లవారగానే తమ నిర్ణయాలను మర్చిపోయే వాళ్లు చాలే మంది. కాని కొందరు మాత్రం తమ నిర్ణయాలకు కట్టుబడి మంచి పనులను మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా పాటించి చూపుతుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రిన్స్ మహేశ్ బాబు.. నమ్రతతో పెళ్లయినా.. గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా మహేశ్ అంటే అమ్మాయిల గుండెల్లో సరికొత్త వైబ్రేషన్. అలాంటి క్రేజ్ సంపాదించిన మహేశ్ బాబు.. ఒకప్పుడు చైన్ స్మోకర్ అట. సెట్ మీద ఉన్నా, బయటకు వెళ్లినా కూడా చేతిలో ఎప్పుడూ సిగరెట్టు వెలుగుతూ ఉండాల్సిందే. ఎన్నిసార్లు సిగరెట్ మానేయాలనుకున్నా కూడా మళ్లీ మళ్లీ కాలుస్తూనే ఉండేవాడట.

అలాంటి సమయంలో మహేశ్ బాబుకు ఓ స్నేహితుడు పొగతాగడం మానేయడం ఎలా అనే విషయంలో సెల్ఫ్ హెల్ప్ పుస్తకం ఒకటి బహూకరించారు. ఇలాంటివి చేయడం అంటే చెప్పినంత సులభం కాదని, మానేసిన ప్రతిసారీ తనకు మళ్లీ కాల్చాలనే కోరిక చాలా గట్టిగా ఉండేదని మహేశ్ అన్నాడు. అలెన్ కార్ రాసిన ఆ పుస్తకంలో మాత్రం.. పొగతాగే అలవాటు మానేయడం ఎలా అనే విషయం చాలా బాగా రాశారని, ఆ పుస్తకం చదివిన తర్వాత తాను ఇంతవరకు అసలు సిగరెట్ అన్నదే ముట్టుకోలేదని మహేశ్ తెలిపాడు. తాను నటించే సినిమాల్లో కూడా సిగరెట్ తాగే సన్నివేశాలు వద్దనే చెబుతానని, దానివల్ల అభిమానులకు తప్పుడు సందేశం వెళ్తుందని అన్నాడు. అన్ని విషయాల్లో తమ హీరోను ఆదర్శంగా తీసుకునే యువత.. ఈ విషయంలో కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని వెంటనే పొగతాగే అలవాటు మానేయడం మంచిది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  quits smoking  tollywood news  

Other Articles