Chief minister k chandrasekhar rao announced several tops to telangana employees including implementation of prc

K Chandrasekhar Rao announced, Telangana employees, telangana employees facilities, telangana employees implementation of prc, 10th Pay Revision Commission’s (PRC) recommendations, prc to telanagna employees

Chief minister K Chandrasekhar Rao announced several sops to Telangana employees on Monday, including implementation of 10th Pay Revision Commission’s (PRC) recommendations at jet speed

తెలంగాణా ఉద్యోగులకు వరాలే వరాలు

Posted: 12/31/2014 11:25 AM IST
Chief minister k chandrasekhar rao announced several tops to telangana employees including implementation of prc

సంక్రాంతి పండగ రాకముందే తెలంగాణ ఉద్యోగులకు సంక్రాంతి పండగ వచ్చింది. తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణా ముఖ్యమంత్రి వరాల మీద వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) డైరీని ఆవిష్కరించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉద్యోగులకు వరాలు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న దంపతులను ఒకే ప్రాంతానికి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. హెల్త్‌కార్డుల జారీ మినహా ఇప్పటివరకు ప్రభుత్వం ఉద్యోగులకు పెద్దగా ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అన్ని సమస్యలను అధిగమించి ఆరోగ్య కార్డులను వంద శాతం అమలు చేస్తామన్నారు. దీనిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చారు. సకల జనుల సమ్మె కాలంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు.

హైదరాబాద్‌లో నిరుపయోగంగా మారిన రాజీవ్ స్వగృహ ఇళ్లను లాభనష్టాలతో సంబంధం లేకుండా కట్టిన ధరకే ఉద్యోగులకు కేటాయిస్తామన్నారు. అయితే, ప్రభుత్వంతో ఘర్షణ పడే వైఖరి మంచిది కాదని ఉద్యోగులకు కేసీఆర్ సూచించారు. కమల్‌నాథన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశమై అన్ని అంశాలపై చర్చిస్తానని చెప్పారు. జోనల్ విధానం కొనసాగింపుపై ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. తమది ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వమని, ఉద్యోగులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

మన రాష్ట్రం కోసం మనం పనిచేద్దామనే భావన ఉద్యోగుల్లో ఉంటే సత్ఫలితాలొస్తాయన్నారు. విద్యుత్ ప్లాంట్లతోపాటు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించాలని ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోకుండా వాటి బాధ్యతను ఆయా శాఖలకే అప్పగించామని గుర్తుచేశారు. కమల్‌నాథన్, షీలా బీడే కమిటీల పని పూర్తయితే ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వస్తుందని, ఆ వెంటనే వాటి భర్తీ చేపడుతామని పేర్కొన్నారు. జనవరి మూడో వారంలో ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణను ప్రకటించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

నిజాం వారసులైన ‘పైగా’ కుటుంబానికి సంబంధించి లక్షల కోట్ల విలువ చేసే భూములు ఇనాం అబాలిషన్ చట్టం ద్వారా ప్రభుత్వ పరమయ్యాయని,  ‘పైగా’ కుటుంబీకులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, వివాదాల పరిష్కారం కోసం త్వరలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. ఎంతో ఉన్నతమైన శాసన మండలి చైర్మన్ పదవిలో ఉన్న స్వామిగౌడ్ మాటలు ప్రభుత్వానికి కోర్టు ఆదేశాల వంటివని కేసీఆర్ చలోక్తులు విసిరారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles