Kcr gives nominated posts to trs mlas

KCR, KCR gives nominated posts to mlas, Telangana Nominated Posts, Nominated Posts In Telangana, Telangana latest updates, Telangana mla list, Telangana ministers list, Telangana ministers portfolio, Telangana latest, konda surekha on kcr, trs un satisfied mlas, kcr on Telangana development, telangana latest

KCR gives Nominated posts to trs mlas : Telangana Cm and TRS Chief KCR plans to give nominated posts to unsatisfied and minister post expected mlas. In nominated post list Konda Surekha, Vidyasagar rao, E Ravindra Reddy, Somarapu Sathyanarayana, Prashanta reddy and others are there. TRS Mlas hopes about nominated posts

కేసీఆర్ కొత్త ఆఫర్లు..., రీచార్జ్ అవుతున్న అసంతృప్తులు

Posted: 12/30/2014 07:51 AM IST
Kcr gives nominated posts to trs mlas

తెలుగు రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు వేయటంలో చంద్రబాబు ఎంతటి మేధావో.., చంద్రశేఖరుడు కూడా ఆంతే పరాక్రముడు. ఎంతయినా ఆ చెట్టు పండే కదా.., అలాంటి రాజకీయాలు అలవాటు పడి ఉంటాయి. పార్టీలో అసంతృప్తి వచ్చిందంటే వారిని బుజ్జగించటం.. ఏ మాత్రం అనుమానం వచ్చినా కనీసం వివరణ కూడా తీసుకోకుండా బయటకు పంపేయటం టీఆర్.ఎస్. లిస్ట్ లో లేని సిద్దాంతాలు. పార్టీ పెట్టిన పద్నాలుగు సంవత్సరాలకు అధికారంలోకి రావటంతో.., ఇన్నాళ్ళు కష్టపడ్డ నేతలంతా ఇప్పుడు.., పదవులతో సుఖపడుదామనుకుంటున్నారు. వీరిలో అధికులను తృప్తి పర్చేందుకు మంత్రి పదవులు ఇచ్చారు. పదవులు ఆశించి భంగపడ్డ వారు అసంతృప్తిలో ఉన్నారు.

అసంతృప్తులపై దృష్టిపెట్టిన తెలంగాణ సీఎం.., వారికీ పదవులు కట్టబెట్టి సంతోషపెట్టాలని చూస్తున్నారు. కొత్త ఆఫర్ల ప్రకటనకు ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. చేతిలో ఉండే నామినేటెడ్ పోస్టులను అసంతృప్త ఎమ్మెల్యేలకు ఇస్తారట. ఈ మద్య మంత్రివర్గ విస్తరణలో బాగా భంగపడ్డ ఇ.రవీంద్రరెడ్డి, కొండా సురేఖ, రామలింగారెడ్డి, విద్యాసాగర్ రావు, సోమారపు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు ఇంకొందరు కూడా ఈ పోస్టులను ఆశిస్తున్నారు. ఆశావహుల పేర్లన్నిటినీ పరిశీలించి వారికి ప్రాధాన్యతల ప్రకారం కుర్చీలను కేటాయిస్తారన్నమాట. కేసీఆర్ ప్రకటిస్తున్న ఈ కొత్త ఆఫర్ తో అసంతృప్త ఎమ్మెల్యేలు రీచార్జ్ అవుతున్నారు. సీఎం తమకేం ఇస్తాడో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రకటన చేయటమే ఆలస్యం... అంతా నేమ్ బోర్డులు కొట్టించేస్తారట.  

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  kcr  nominated posts  

Other Articles