Bangalore bomb blast

Bangalore Blast, Bangalore Blast update, Bangalore Blast latest, Bangalore Blast 2014, Bangalore Bomb Blast today, Bangalore Blast death toll, Rajnath singh on Bangalore Blast, Bangalore Blast high alert, India new year celebrations, Hyderabad New Year Celebrations, Bangalore Latest News, siddaramaiah on Bangalore Blast

Bangalore Bomb blast : Police enquiring on IED Blast case suspects are nabbed. NIA and Local Police enquiring into blast case doubt on SIMI activists and two persons held in case. central announce high alert on Delhi with Bangalore Blast, and also warns state government to be alert

బెంగళూరులో బాంబు పేలుడు, హై అలర్ట్ ప్రకటన

Posted: 12/29/2014 07:34 AM IST
Bangalore bomb blast

నిఘా సంస్థలూ, కేంద్ర ప్రభుత్వం అనుమానించింది నిజమయింది. నూతన సంవత్సర, రిపబ్లిక్ డే సందర్బంగా ఉగ్రవాదులు దాడులు చేస్తారన్న అనుమనాలు నిజమయ్యాయి. ఆదివారం రాత్రి బెంగళూరులో బాంబు పేలుడు సంభవించింది. ఉగ్రవాద దాడిగా భావిస్తున్న ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. రాత్రి సమయంలో బ్రిగేడ్ రోడ్డు సమీపంలోని కోకోనట్ గ్రూపు హోటల్ బయట ఈ పేలుడు సంభవించింది.

పేలుడు విషయం తెలుసుకున్న స్థానిక పోలిసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఈడీ పేలుడు అని గుర్తించటంతో ఉగ్రవాదుల పనిగా అనుమానిస్తున్నారు. సిమి కార్యకర్తల ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉదయం నుంచి పార్క్ చేసి ఉంచిన బైకును స్వాధీనం చేసుకున్నారు. ఇతర అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు నగర పోలిసులు వెల్లడించారు.

తాజా పేలుడుతో బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో షాపింగ్ మాల్స్, సాఫ్ట్ వేర్ కంపనీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసే నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అటు రాష్ర్టప్రభుత్వంతో సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ దాడితో ఇతర రాష్ట్రాలూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Blast  Rajnath Singh  terrorist attacks  

Other Articles