Rajasthan ministers receive threatening mails from indian mujahideen

Rajasthan ministers receive threatening mails, Rajasthan ministers got threatening mails, Rajasthan on Hi alert, ministers receive threating mails, MLAs receive threating mails, ministers receive Indian Mujahideen threating mails, MLAs receive Indian Mujahideen threating mails, ministers officials mails recieve threating messages, Rajasthan republic day threats, Rajasthan republic day threat messages

Some of the Ministers in Rajasthan have received threatening message on their official email IDs, DGP Omendra Bharadwaj said on Friday.

‘మేం ఏం చేస్తామో.. మీరు అర్థం చేసుకోండి’

Posted: 12/26/2014 05:07 PM IST
Rajasthan ministers receive threatening mails from indian mujahideen

కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చాక, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాస్తా స్థబ్దుగా వున్న ఇండియన్ ముజాహిద్దీన్ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత ఆరు మాసాలుగా ఎలాంటి తీవ్రవాద దాడులు లేకుండా ప్రశాంతంగా వున్న దేశంలో మరోమారు అలజడి సృష్టించేందుకు వారు పూనుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో తాము దాడులు జరుపుతామని పేర్కొంటూ వారు రాజస్థాన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తూ.. ఈ మెయిల్స్ ను పంపారు.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాజస్థాన్ లో దాడులు చేస్తామని ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ మేరకు 10 మంది రాజస్థాన్ మంత్రులతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలకు చెందిన అధికారిక మెయిళ్లకు వారు హెచ్చరికలు పంపారు. జనవరి 26న తప్పనిసరిగా దాడులు చేసి తీరుతామని ఆ సందేశాల్లో ఉగ్రవాదులు హెచ్చరించారు. క్యాబినెట్ మంత్రులకు నేరుగా హెచ్చరికల జారీ చేస్తూ వచ్చిన ఈ మెయిళ్లపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మెసేజ్ లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని కనుగొనే పనిలో పోలీసుల సైబర్ వింగ్ నిమగ్నమైంది.

రాజస్థాన్ లో పలువురు మంత్రులకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని.. మంత్రుల అధికారికి మెయిల్ ఐడీలకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని రాజస్థాన్ డీజీపీ ఒమేంద్ర భరద్వాజ్ తెలిపారు. 'మేము ఏం చేస్తామో మీరు అర్థం చేసుకోండి' అంటూ ఉగ్రవాదులు మెయిల్ లో పేర్కొన్నారు. అయితే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాజస్థాన్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో వాహనాల తనిఖీలను ప్రారంభించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనబడితే.. తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  terrorists  Indian Mujahideen  Ministers  

Other Articles