Goat gives birth human babies

goat gives birth human babies, goat gives birth babies, goat delivers human babies in karnataka, goat delivery latest news updates, human delivery process, interesting facts weird news, pregnant precautions and health tips latest updates

goat gives birth human babies : its surprise and shock to hear that goat in H.D.kote in karnataka gives birth to two human babies, owner of goat consulted doctors and they said that it happens because of fatal anasarta

పండంటి ఆడ, మగ బిడ్డలకు జన్మనిచ్చిన మేక

Posted: 12/23/2014 03:49 PM IST
Goat gives birth human babies

ప్రపంచంలో ఎన్నడూ చూడని వింతలు జరుగుతాయి అంటే ఏమో అనుకున్నాం. మానవజాతి అంతా ఆశ్చర్యపడే విధంగా జరిగిన ఈ సంఘటన సంచలనం కల్గిస్తోంది. నాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లుగా.., జంతువు కడుపున మనిషి పుట్టడం జరిగింది. కర్ణాటకలో ఓ మేక మనిషి రూపాన్ని పోలి ఉన్న శిశువులకు జన్మనిచ్చింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం కల్గిస్తోంది. పూర్తి వివరాలు చూస్తే.., హెచ్.డి. తాలుకాలోని సొలాపూర్ కుగ్రామంలో బాస్కర్ అనే యజమాని మేక ప్రసవించింది. ఇందులో కొత్తేమి లేకపోయినా.., మనిషి రూపంలో ఉన్న పిల్లలకు జన్మనివ్వటమే ఆశ్చర్యకరం.

ముందుగా మగ శిశువు రూపానికి జన్మనిచ్చిన మేక.., నాలుగు గంటల తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సారి ఆడశిశువు రూపం బయటకు వచ్చింది. ఇది చూసిన భాస్కర్ స్థానిక వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. శిశువులను పరిశీలించిన అధికారులు ‘ఫెటల్ అనసర్త’ వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. జన్యవుల లోపాలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. వీటిని జాగ్రత్తగా భద్రపర్చి మైసూర్ ఉత్సవాల్లో ప్రదర్శనకు ఉంతామన్నారు.

మనిషి రూపాలున్న శిశువుల జననం పట్ల భాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేయటంతో పాటు ఒకింత భయాందోళనకు గురవుతున్నాడు. ఇంట్లో చాలా పశువులు ఉన్నా ఎప్పుడూ ఇలా జరగలేదు. తొలిసారి ఇలా జరగటంతో ఏదైనా కీడు జరుగుతుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అదంతా అపోహ అని కొట్టిపారేస్తున్నారు. రెండు వాదనల సంగతి ఎలా ఉన్నా.., మున్ముందు ఎన్నెన్ని వింతలు, విడ్డూరాలు చూడాల్సి వస్తుందో.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goat delivery  latest weird news  karnataka latest  

Other Articles