Venkataswamy in critical condition

venkataswamy critical condition, Congress senior leader venkataswamy, venkataswamy hospitalized, venkataswamy care hospital, venkatswamy, senior congress leader venkataswamy, venkataswamy alias kaka hospitalised, kaka critical, kaka hospitalised

Congress senior leader venkataswamy hospitalized again, and in critical condition

కాంగ్రెస్ కురువృద్దుడు కాకా పరిస్థితి విషమం

Posted: 12/22/2014 12:50 PM IST
Venkataswamy in critical condition

కాంగ్రెస్ కురువృద్దుడు, సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న వెంకటస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. గత రాత్రి వైద్యులు ఆయనను ఐసీయూలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నట్లు సమాచారం. గతంలో రెండు పర్యాయాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడిన కాకా.. అస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్న తరువాత అరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఇప్పుడు కూడా కాకా అరోగ్యం బాగుపడాలని పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అకాంక్షిస్తున్నారు. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkataswamy  hospitalized  critical condition  care Hospital  

Other Articles