World s first black and white tomato plant created by british breeder

World's first black and white tomato plant, first black and white tomato plant, British breeder tomato plant, Sutton Seeds tomato plant, monochrome fruit, plant breeder blended two tomato varieties, Indigo Rose black tomato

Sutton Seeds had previously created the the planet’s only black tomato and has now blended it with a white strain to create the monochrome fruit

తొలిసారిగా నలుపు, తెలుపు వర్ణపు టమాటాలు..

Posted: 12/21/2014 07:18 PM IST
World s first black and white tomato plant created by british breeder

టమోటా ఏ రంగులో వుంటుంది అని అడగగానే.. ఒకటో తరగతి కుర్రాడు కూడా చెప్పేస్తాడు. ఎరుపు రంగులో వుంటుందని. కానీ ఇప్పుడైనా తెలుపు వర్ణం టమోటాను చూశారా అంటే కాస్త అటుఇటుగా వుండే తెలుపు వర్ణం టమోటాలను చూశామని చెబుతారు పెద్దలు. అయితే మీ ఊహకందని ప్రశ్న ఒకటి అడుతున్నాం చెబుతారా..? ఎప్పుడైనా నల్లని టమోటాలను చూశారా..? అవునండి నిజంగా.. జోక్ చేశామనుకుంటున్నారా..? లేదు ఎప్పుడైనా నలుపు వర్ణం టమోటాలను చూశారా..? మరి అంతలా ఆశ్చర్యపోకండి. ఈ ఫోటోలో మీకు వంకాలుగా కనబడుతున్నవి వంకాలు కాదు టమోటాలే. అయితే నలుపు, తెలుపు వర్ణాల టమోటాలు ఒకే మొక్కకు కాయడం ఎక్కడనా చూశారా..? మీరే కాదు ఇప్పటి వరకు వాళ్లు తప్ప ఎవ్వరూ చూడలేదు.

వాళ్లే బ్రీటీష్ దేశంటోని సూటన్ సీడ్స్ సంస్థ ప్రతినిధులు. ప్రపంచంలోనే తొలిసారిగా వీటిని బ్రీటీష్ కు చెందిన ఓ మెక్కల పెంపకం సంస్థ వీటిని రూపొందించింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇండిగో రేస్ అన్న పేరుతో నల్లని టమోల తయారు చేసిన సంస్థ ఇప్పుడు ప్రత్యేకంగా చెర్రీ స్ట్రేయిన్ పేరుతో తెల్లని టామోటలు తయారు చేసింది. ఈ రెండు రకాల టమాటాలను వారు ఒకే మొక్క నుంచి కాసే అరుదైన మొక్కను తయారు చేశారు. ఈ సందర్భంగా సూటన్ విత్తనాలకు చెందిన అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ముందుగా తాము నలుపు మరియు తెలుపు టమోటా ఉత్పత్తులను తయారు చేశామన్నారు.

ఆ తరువాత ఈ రెండు రకాలను మార్పిడి చేయడంతో తాము అరుదైన ఫలితాలను సాధించామని చెప్పారు. ఈ రెండు రకాలతో పాటు మార్కెట్లో లభించే ఎర్రని టమోటాలతో కలపి మంచి రుచికరమైన ఆశ్చర్యకరమైన సలాడ్లు, సాండ్విచ్ లు చేసుకోవచ్చునని చెప్పారు. అవి ఎంతో రుచికరంగా వుంటాయని, మీరు రుచి చూసిన తరువాత మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపోరుగు వారితో అనుభవాలను పంచుకునేంత రుచి తమది బాధ్యతని సంస్థ ప్రతినిధులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు అరుదైన తెలుపు, నలుపు టమోటాలను కాపుకాసే మొక్క నాలుగు డాలర్లకు అంటే మన కరెన్సీలో సుమారు రెండు వందల నలబై రూపాయలకు అందుబాటులో లభిస్తుందని చెబుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black and white tomato plant  Sutton Seeds  British breeder  

Other Articles