Jabardasth case filed osmania university

jabardatsth tv show cases, cases on jabardatsth tv show, osmania university students case on jabardatsth tv show, jabardasth cases latest news, tollywood latest news upates, osmania university latest updates, telugu tv shows, telugu game tv shows, etv telugu programmes tv shows

jabardasth case filed osmania university : telugu popular tv comedy show jabardasth facing problems in recent days latest news that case filed against osmania university police station on allegations of criticise a cast

ఈటీవీ ‘జబర్దస్త్’పై క్రిమినల్ కేసుకు డిమాండ్

Posted: 12/20/2014 07:02 AM IST
Jabardasth case filed osmania university

తెలుగు పాపులర్ కామెడి షో ‘జబర్దస్త్’కు ఈ మద్య కష్టాలు వెంటాడుతున్నాయి. మిగతా టీవీ షోలతో దీనికి ఉన్న ఆదరణ కాస్త తగ్గుతోంది. దీనికి తోడు వరుసగా కేసులు ఇబ్బందికల్గిస్తున్నాయి. షోలో వచ్చే వెకిలి కామెడి.., ఎగతాళి చేసే మాటలపై ప్రజలు ఎప్పటినుంచో విసుగెత్తిపోగా.., ఇప్పుడవి కేసులకు దారి తీస్తోంది. తాజాగా ఈనెల 18న ప్రసారం అయిన షోలో గౌడ కులస్తులు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గ మహిళలను కించపర్చేలా  ఒక స్కిట్ ఉందని ఉస్మానియా యునివర్సిటీలో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. కార్యక్రమంలో ప్రసారం చేసిన కామెడి తమ వర్గంను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ గౌడ విద్యార్థి సంఘం నేతలు కంప్లయింట్ ఇచ్చారు.

స్కిట్ చేసిన వారితో పాటు జడ్జీలు, టీవీ యాజమాన్యంపై కూడా కేసు పెట్టాలని తెలిపారు. కంప్లయింట్ అందుకున్న పోలిసులు.., అన్ని అంశాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇదే వారంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన ఓ న్యాయవాది గతంలో ప్రసారం చేసిన షొలో ఓ స్కిట్ లో న్యాయవాద వృత్తిని అవమానించేలా చూపించారని ఆరోపిస్తూ కంప్లయింట్ చేశారు. కామెడి షోకు ఇలా వరుసగా కేసులు వెంట పడటం ఆందోళన కల్గిస్తోందని కార్యక్రమ నిర్వాహకులు చెప్తున్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jabardasth tv show  osmania university  telugu tv shows  

Other Articles