Chandrababu ignoring husbandmen

chandrababu ignoring husbandmen, no step taken on babu guarantee, kapunadu state president vannampula Narayana Swamy, narayana swamy lashes out on Tdp government, no action taken on kapu including into Bc, babu government disrespeting kapus, narayana swamy slams babu government, narayanaswamy asks to keep babu guarantee

Chandrababu naidu guaranteed people of upper caste (Kapuu) will be included in BC before election and after into power of six months not taken any stand

కాపులను విస్మరిస్తున్న చంద్రబాబు..

Posted: 12/19/2014 05:02 PM IST
Chandrababu ignoring husbandmen

ప్రజలకు అది చేస్తాను, ఇది చేస్తానూ అంటూ ఎన్నికల ముందు హామాలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మరోమారు తన నిజస్వరూపాన్ని చూపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపూల నారాయణస్వామి మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నారాయణస్వామి రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు జిల్లాల కాపు నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీ పట్ల చంద్రబాబు వ్వవహరిస్తున్న ఉదాసీన వైఖరి సరికాదన్నారు. ఎన్నికల ముందు కాపులు తమకు వెయ్యేనుగుల బలమని చెప్పి ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత తమను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కావస్తున్నా చంద్రబాబు తమకు ఇచ్చిన హామీపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటుతున్నా బీసీ కమిషన్ నియామకంగాని, బీసీల్లో చేర్చేందుకు అవసరమైన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సర్వేను కానీ చేపట్టేందుకు అదేశాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కోటి రూపాయలు కేటాయించకుండా కాపుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి వల్ల అధికారంలోకి వచ్చామో చంద్రబాబు గుర్తెరగాలన్నారు. హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్ అందించాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. హామీలపై సీఎం చంద్రబాబును కలవనున్నట్టు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  AP government  Naidu  vannampula Narayana Swamy  guarantees  

Other Articles