Ruble collapse shakes russian economy consumers

russion ruble fall down, the ruble's collapse, rassian economy shakes,, russia,s ruble went into free fall

The ruble hit a record low of 80 to the dollar — down a catastrophic 24 percent ... The ruble's collapse spurred Russians to rush out and buy imported cars.

ఆర్థికంగా కుదేలవుతున్న రష్యా..!

Posted: 12/17/2014 10:11 AM IST
Ruble collapse shakes russian economy consumers

రష్యా ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం చుట్టు ముట్టేస్తుంది. గత కొన్ని రోజుల్లోనే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భారీగా పడిపోవటంతో ప్రధానంగా చమురు ఎగుమతుల పైనే ఆధారపడిన రష్యా ఆర్ధిక వ్యవస్థ తిరోగమన బాట పట్టింది... దానితో ఆర్థికంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కుంటుంది. రష్యా రూబుల్ మారకం విలువ గత కొన్ని రోజులుగా పడిపోతుంది. మంగళవారం డాలర్ తో రష్యా రూబుల్ మారకపు విలువ ఒకే రోజు 10 శాతానికి పైగా క్షీణించటం.., రష్యా ఆర్ధిక నిపుణులకు గుండె నొప్పి తెప్పిస్తుంది.

ఇదిలా ఉంటె రష్యా.., రూబుల్ ను బలోపేతం చేయటానికి రష్యా కేంద్ర బ్యాంకు రాత్రికి రాత్రే ఉహించని విధంగా వడ్డీ రేట్లను ఏకంగా 6.5 శాతం పెంచేసి  17 శాతం వరకు చేసింది. ఇలా తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ రూబుల్ క్షీణించటంతో రష్యా  ట్రేడర్లు, ఆర్ధిక నిపుణుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. కొందరు నిపుణులు 1998 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వణుకుతున్నారు.

ఈ పరిస్థితి పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ప్రకటన చేస్తూ రూబుల్ భారీ పతనానికి చమురు ధరల క్షీణత, పశ్చిమ దేశాలు, స్పెక్యులేటర్లె కారణమని అన్నారు. ఏది ఏమైనా రూబుల్ భారి పతనం పుతిన్ కు పెద్ద సవాల్ కానుందని ఆర్ధిక విశ్లేషకులు చెప్తున్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : russion ruble fall down  the ruble collapse  rassian economy shakes  

Other Articles