Produced before a delhi court accused cab driver sent to three day police custody

uber car driver, delhi rape case, cab driver arrested, delhi rape incident

Shiv Kumar Yadav, the taxi driver who worked with international cab service Uber, was on Monday produced before a Delhi court in connection with the rape of a 25-year-old woman in the national capital.

దేశ రాజధానిలో జరిగిన అత్యాచార ఘటన నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరచిన ఢిల్లీ పోలీసులు

Posted: 12/08/2014 06:40 PM IST
Produced before a delhi court accused cab driver sent to three day police custody

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడు శివ కుమార్ యాదవ్ ని పోలీసులు నిన్న అతని చరవాణి  (ఫోన్) సంకేతాల ఆధారంగా మధుర లో అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఈ రోజు అతన్ని న్యాయస్థానంలో హాజరు పరచగా నిందితున్ని విచారణ నిమిత్తం పోలీసులకు మూడు రోజుల కస్టడికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పోలీస్ లు అతన్ని విచారించే పనిలో పడ్డారు. 

ఆ నిందితుడు ఇంతకుముందే ఒక అత్యాచార కేసు నిమిత్తం శిక్ష పడి ఏడు నెలలు తీహార్ జైలులో ఉండి వచ్చినట్లు విచారణలో తేలింది. ఇదిలా ఉంటె న్యాయస్థానంలో నిందితుడు శివ కుమార్ యాదవ్ ని హాజరు పరచినప్పుడు న్యాయస్థాన పరిసరాల్లో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది న్యాయవాదులు, గుర్తు తెలియని వ్యక్తులు నిందితుని పై దాడి చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఘటనని సమీక్షించి పరిస్థితి ని అదుపులోకి తీసుకొచ్చారు.  

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi police  delhi high court  delhi rape victim  cab driver  

Other Articles