Rohtak sisters to be honoured on republic day by haryana govt molesters sent to judicial custody

Haryana, Rohtak, Haryana sisters, molestation, , Aarti, Pooja, Haryana brave girls, Crime against women, Molestation, Haryana Roadways bus, rape, panchayat, Caught on Camera, Viral video, Haryana Government, bravery award, Republic day,

Haryana government announced that it will honour the two sisters, who single-handedly took on three alleged molesters in a moving bus, on Republic Day as the girls came in for praise for their bravery.

ఆ అక్కాచెల్లళ్లకు సర్కారు సాహస సత్కారం..

Posted: 12/02/2014 12:53 PM IST
Rohtak sisters to be honoured on republic day by haryana govt molesters sent to judicial custody

ముగ్గురు పోకిరీలు.. వెకిలి చేష్టలు.. సూటిపోటి మాటలు.. అయినా బెదరకుండా వారి ఆటలు మొక్కవోని ధైర్యసాహాసాలతో కటించిన సాహస అక్కాచెల్లెళ్లకు అరుదైన గౌరవం దక్కనుంది! ఆ యువతులకు సాహస రివా ర్డు దక్కనుంది. గణతంత్ర దినోత్సవాన ఆ అక్కాచెల్లెళ్లు ఆర్తీ కుమార్‌(22), పూజ(19)లకు నగదు బహుమతిని అందించి సత్కారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నిర్ణయించారు. రోహ్‌టక్‌కు చెందిన వారు బస్సులో వెళుతుండగా ముగ్గురు యువకులు వేధించి.. వారి చేతిలో చావుదెబ్బలు తిన్నారు. కాగా, ప్రయణికులకు, ప్రత్యేకించి మహిళల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ, రోడ్డు రవాణా సంస్థను హర్యానా ప్రభుత్వం ఆదేశించింది.

సంఘటన అనంతరం పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు యువకులు కుల్దీప్‌, మోహిత్‌, దీపక్‌ను అరెస్టు చేశారు. యువతులను వేదించిన పోకిరీలకు డిసెంబర్‌ 6 వరకు కోర్టు జుడిషియల్‌ కస్టడీ విధించింది. అయితే కేసుకు న్యాయబద్ధమైన ముగింపు పలికేందుకు ఆ సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు, బస్సులోని మిగతా ప్రయాణికులు దర్యాప్తునకు సహకరించాలని జిల్లా ఎస్పీ శషాంక్‌ ఆనంద్‌ కోరారు. కాగా, నిందితులపై పెట్టిన కేసును వాపసు తీసుకోవాలంటూ తమ తండ్రిని కొందరు బెదిరించారని ఆర్తీ ఆరోపించారు.

మరోవైపు, ముగ్గురు యువకులు కుల్దీప్‌, మోహిత్‌, దీపక్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో వారి గ్రామస్థులు అల్టిమేటం జారీ చేశారు. వారిని 24 గంటల్లో విడిచిపెట్టకపోతే రోడ్లన్నింటినీ దిగ్బంధం చేస్తామని కన్ల్సా గ్రామస్థులు జిల్లా పరిపాలన విభాగం, ఎస్పీకి అల్టిమేటం ఇచ్చారు. ఆ అమ్మాయిలను తమ పిల్లలు వేధించలేదని, కేవలం సీట్ల విషయంలో గొడవ జరిగిందని వివరించారు. అయితే ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెడతామని ఎస్పీ హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles