Sania mirza writing her autobiography

Tennis, telangana brand ambassador, rank 6, WTA finals singapore, auto biography, Release

sania mirza writing her autobiography

ఆత్మకథ రాస్తున్న మరో భారత క్రీడాకారిణి

Posted: 11/08/2014 09:11 AM IST
Sania mirza writing her autobiography

ప్రస్తుతం ప్రముఖ క్రీడాకారుల ఆత్మకథల హవా నడుస్తున్నది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ తన ఆటోబయోగ్రఫీతో అప్పటి క్రికెట్ కోచ్ చాపెల్ పై రాసిన వ్యాఖ్యాలు సంచలనాలు సృష్టిస్తుండగా, ఇప్పుడు తాజాగా భారత టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా తన ఆత్మకథను రాయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే తన ఆత్మకథను రాయడంలో నిమగ్నమైన సానియా 26 చాప్టర్లును పూర్తి చేసిందట. తన జీవితంలో ప్రతీ రోజు కోనసాగుతుండటంతో కొత్త చాప్టర్లు అదనంగా వచ్చి చేరుతున్నాయని చెప్పింది.

తన గురించి చాలా విషయాలను ప్రచారంలో వున్నాయని వాటిలో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్దాలు కూడా ప్రచారం అవుతున్నాయన్నారు. అందుకనే తానే తన కథను రాయాలని పూనుకున్నట్లు చెప్పారు. తన కథను తనే చెబితే బాగుంటుందన్న అభిప్రాయంతోనే తాను అటోబయోగ్రఫీ రాస్తున్నట్లు సానియా మిర్జా చెప్పారు. సచిన టెండుల్కర్ రాసిన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పై స్పందించిన సానియా.. పుస్తకాలు అమ్మకం జరగడం కోసం తాము వివాదాలను సృష్టించబోమని అమె సచిన్ ను వెనకేసుకోచ్చారు. అదీనూ సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజం అసలు అలాంటి చర్యలకు ఉపక్రమించబోరని అమె కుండబద్దలు కోట్టారు.

తాను ఒంటరిగా టెన్నీస్ మ్యాచ్ లు అడనన్న నిర్ణయంపై సానియా మిర్జా వివరణ ఇచ్చారు. తాను ఈ ఆటలో భాగంగా ఐదేళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు మూడు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని, దీంతోనే తాను ఒంటరిగా సింగిల్స్ మ్యాచ్ లలో ఆడబోనని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తన పేరున హైదరాబాద్ లో టెన్నీస్ అకాడమి కూడా ప్రారంభించానని చెప్పారు. తన సహచరి హైదరాబాద్ బాడ్మింటిన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పేరును ప్రస్తావించకుండానే తనకు సినిమాల్లో నటించాలన్న కోరిక లేదని మిడియా అగిడిన ప్రశ్నకు సానియా బదులుచెప్పింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tennis  telangana brand ambassador  rank 6  WTA finals singapore  auto biography  Release  

Other Articles