Irom sharmila s fast demanding repeal of afspa enters 15th year says she believe pm modi

Irom Sharmila, fast, demand, repeal, AFSPA, 15th year, PM Modi, Prime minister, Narendra modi, Manipur

Irom Sharmila's fast demanding repeal of AFSPA enters 15th year, says she believe PM Modi, who will repeal AFSPA from Manipur

15వ సంవత్సరంలోకి షర్మిల దీక్ష.. ప్రధానిపై నమ్మకం వుందన్న ఉక్కు మహిళ

Posted: 11/06/2014 07:50 PM IST
Irom sharmila s fast demanding repeal of afspa enters 15th year says she believe pm modi

మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల నిరాహార దీక్షలో సంవత్సరం జత కలిసింది. 14 ఏళ్లు పూర్తిచేసుకుని ఇవాళ పదిహేనో ఏట ప్రవేశించింది. తన దీక్ష ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అధిక సమయాన్ని ఆమె పోలీసుల నిర్భందలోనే గడిపింది. ఇరోం షర్మిలను అదుపులోకి తీసుకోవడం.. ఆ తరువాత కొంత కాలనికి విడచిపెట్టడం.. మళీ షర్మిల దీక్షలకు పూనుకోవడం.. మరోమారు పోలీసులు అమెను అదుపులోకి తీసుకోవడం.. న్యాయస్థానం ‘స్వేచ్ఛా జీవితాన్ని’ కల్పించడం... అంతలోనే పోలీసులు అరెస్టు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమయ్యింది. ఈశాన్య పర్వత రాష్ట్రం మణిపూర్ కు చెందిన షర్మిల ఇప్పడు దేశవ్యాప్తంగా సుపరిచితురాలైంది. పలు సందర్భాలలో ఎక్కడ చూసి షర్మీల గురిచే చర్చ. 14 ఏళ్లుగా అమె దీక్షను ఎందుకు చేపట్టింది. అసలు ఏం కావాలని దీక్షను చేస్తోంది. అమె కావాల్సింది సమాకూర్చడానికి ప్రభుత్వాలకు 14 ఏళ్లు కూడా సరిపోవడం లేదా..?


14 ఏళ్ళ క్రితం మణిపూర్‌లో జరిగిన నరమేధం జరిగింది. 2000 సంవత్సరం నవంబరు 2న అస్సాం రైఫిల్స్ సిబ్బంది చేతిలో 10 మంది పౌరులు హతులైయ్యారు. ఈ ఘటన షర్మిలను కదిలించింది. అప్పటికే అలాంటి పలు సంఘటనలు చోటుచేసుకోవడంతో ఆగ్రహించిన ఆమె ఏఎఫ్ఎస్‌పీఏ-1958(ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ నవంబరు 5న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకు ఆమె నిరాహారదీక్ష కొనసాగిస్తూనే వున్నారు. ప్రపంచంలో ఇంత ఎక్కువకాలం నిరాహారదీక్ష చేస్తోన్న వ్యక్తిగా కూడా షర్మిల రికార్డులకెక్కారు ఇరోం షర్మిల. ఘనాహారం తీసుకోనప్పటికీ, ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారాన్ని పంపిస్తున్నారు. అలా ఆమె ఇప్పటిదాకా జీవించి వున్నారు. కాగా, వైద్య చికిత్స నిమిత్తమై మాత్రమే ఇరోం షర్మిలను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారట. ఈ విషయాన్ని ఇరోం షర్మిల సన్నిహితులే వెల్లడించడం గమనార్హం.

రాజకీయ పార్టీలు, నాయకులు బుజ్జగించినా, ప్రభుత్వాలే నచ్చజెప్పాలని చూసినా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఇరోం షర్మిల నిరాహార దీక్ష చేయడం గొప్ప విషయమే. అయితే ఆమె డిమాండ్ల విషయంలో మాత్రం పాలకులు మెత్తబడకపోవడంతోనే ఆమె ఇంకా తన దీక్షను కొనసాగిస్తున్నారని ఇరోం షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆమెను ఎన్నికల బరిలోకి దించాలనే ప్రయత్నం చేసింది. అయితే షర్మిల, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతిపాదనల్ని తిరస్కరించారు. తాను రాజకీయాల కోసం ఉద్యమం చేయడంలేదనీ, మణిపూర్‌ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నానని అప్పట్లోనే ఆమె స్పష్టం చేశారు.

 షర్మిల నిరాహార దీక్ష 15వ ఒడిలోకి చేరిన సందర్భంగా మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, స్వచ్ఛందసంఘాలు, మానవహక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె దీక్షను భగ్నం చేయాలని పలుమార్లు పోలీసులు అరెస్టు చేయడం, వైద్యులు బలవంతంగా ఆమెకు పైపుల ద్వారా ద్రవాహారం ఇవ్వడం, విడుదలయ్యాక తిరిగి ఆమె దీక్ష కొనసాగించడం...ఈ క్రమం పద్నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే తన దీక్ష 15వ ఒడిలే చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల తనకు ప్రధాని మోడీపై అపారమైన నమ్మకం వుందని అన్నారు. మోడీ తన డిమాండ్లను నెరవేర్చగలరన్నారని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అమె అనుకున్నదే జరిగితే.. ఈశాన్య రాష్ట్రాల ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపుకున్నట్లేనని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Irom Sharmila  fast  demand  repeal  AFSPA  15th year  PM Modi  Prime minister  Narendra modi  Manipur  

Other Articles