కృషి ఉంటే మనుషులు రుషులవుతారన్నట్లుగా.. మానవుడు తలుచుకుంటే ఏదయినా చేయగలడు అని ఎందరో నిరూపించారు. తమలోని సృజనాత్మకత, కళకు పట్టుదలను జోడించి అద్బుతాలు సృష్టిస్తున్నారు. ఆ కోవలోనే కొలరోడోకు చెందిన మైఖేల్ గ్రాబ్ అద్బుతాలు సృష్టించాడు. పనికిరాని రాళ్ళును ఒక వరుస క్రమంలో పెట్టి కనీవిని ఎరుగని చిత్రాలను చూపించాడు. రాళ్ళను పేర్చటంలో పెద్ద విశేషం ఏముంది అనుకుంటే మీరు పొరబడినట్లే. గ్రాబ్ చేసిన పని అంత సులువేం కాదు. రెండు సమానమైన సైజులున్న రాళ్ళను ఒకదానిపై ఒకటి పెట్టడం మామూలే. కాని గుండుపై గునపం నిలబెట్టినట్లుగా.. చిన్న రాళ్ళపై బండ రాళ్ళను పేర్చాడు.
Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/stone balance
ఇందుకు మైఖేల్ ఎంతగానో కష్టపడ్డాడు. ఒక్కో కళను నిర్మించేందుకు నెలల తరబడి కష్టపడ్డాడు. ఇలా తన ప్రాంతంలో రాళ్ళన్నిటిని పేర్చి చూపరులను కట్టిపడేస్తున్నాడు. ఫెవిక్విక్ లేదా మరొక గ్లూ పెట్టినా ఇంత పకడ్బంధీగా రాళ్లను పేర్చటం మాత్రం మన వల్ల కాదు. కాని ఎలాంటి గమ్ లేకుండా కేవలం గురుత్వాకర్షణ సిద్ధాంతంను ఆధారం చేసుకుని ఈ అద్బుతాలు సృష్టించాడు. మైకేల్ కళాఖండాల్లో ఒకటైన ఈ వీడియో మీకోసం అందిస్తున్నాం చూడండి.
కార్తిక్
(photo courtesy : gravityglue)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more