Woman arrested for tweet showing red stilettos on the quran

Turkey Stilettos, Quran, Tweet, Turkey, Turkey News, Turkey Islam, Islam Quran, Koran, Turkey Religion

Woman Arrested For Tweet Showing Red Stilettos On The Quran

తన ఫోటోను ట్విట్ చేసి.. అరెస్టయిన టర్కీ యువతి

Posted: 10/31/2014 02:30 AM IST
Woman arrested for tweet showing red stilettos on the quran

తన తీసుకున్న ఫోటోను ట్విట్ చేసినందుకు ఓ టర్కీ యువతి కటకటాలపాలైంది. అ ఫోటో వున్నది మాత్రం ఆమె కాదు. అమె కొత్తగా కొన్న పాదరక్షలు వేసుకున్న ఫోటోను తీసి ట్విట్టర్ లో అప్ లోడ్ చేసినందుకు ఆ యువతిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయతే టర్కీలో ఎన్నో ఏళ్లుగా ముస్లిం మత చాంధసవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు మధ్య అగాధం వుంది. ఈ నేపథ్యంలో మహ్మదీయుల పరమ పవిత్రమైన ఖురాన్ పై తన కొత్త చెప్పులతో నిల్చోని దిగిన వివాదాస్పదమైన ఫోటోను అప్ లోడ్ చేసింది.

దీనిపై దుమారం రేగడం.. ఫైర్ బ్రాండ్ గా పేరోందిన అంకారా మేయర్ మెలిహ్ గొక్సెక్ పిర్యాదుతో కదిలిని పోలీసు యంత్రాంగం ఆ యువతిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా మేయర్, తమ మతాన్ని కించపర్చే హక్కు ఎవరికీ లేదని ట్విట్ చేశారు. సదరు యువతి చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ అమె ట్విట్ చేసిన ఒరిజినల్ ఫోటోను అప్ లోడ్ చేశారు.  పాదాలను అపరిశుభ్రతకు ఛిహ్నంగా వాడే టర్కీలో మతగ్రంధంపై కాళ్లు పెట్టి ఫొటోలు దిగడం సహించలేమని పేర్కోన్నారు. ముస్లిం మెజారిటీ వున్న టర్కీలో జస్టిస్ అండ్ డెవెలప్ మెంట్ పార్టీ (ఏకేపీ) నుంచి గెలిచిన మేయర్ ముస్లిం ఓట్లతోనే గెలుపోందినట్లు సమాచారం. తనకు తాను నాస్తికురాలుగా పేర్కోన్న మహిళను కూడా ఆయన విడిచిపెట్టలేదు. అయితే టర్కీ ప్రజాస్వామ్యవాది ముస్తఫా కెమల్ అటాటుక్ ఈ చిత్రాన్ని కోట్ చేయడంతో అది కాస్తా  అంకారా మేయర్ మెలిహ్ గొక్సెక్ దృష్టిలో పడింది. ఇంకేముంది ఆయన పిర్యాదు చేయడం, చకచకా అరెస్టు చేయడం జరిగిపోయాయి.

ఏకేపీ ప్రాబల్యంతో గత పదేళ్లుగా అంకారలో అధికారంలోవున్న మేయర్ ప్రవర్తన అక్కడున్న ప్రజాస్వామ్యవాదులకు అంతగా రుచించడం లేదు. బీబీసి రిపోర్టర్ ను గూడాఛారిగా ముద్రవేసి, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను హింసించడం, దాంతో పాటు లిటిగేజన్ కేసులు పెట్టడంలో మేయర్ ది అందవేసిన చెయ్యిగా అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు మతానికి వ్యతిరేకంగా ట్విట్ చేసిన సుమారు 3000 వేల మందిని మేయర్ అరెస్టు చేయించారని కూడా వార్తలు వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Turkey Stilettos  Quran  Tweet  Turkey  Turkey News  Turkey Islam  Islam Quran  Koran  Turkey Religion  

Other Articles