Student suicide in madhurai

suicide in tamilnadu, suicide in india, students suicide in india, latest news, tamilnadu latest news, death with facebook, death reasons, facebook status psychology, fee reimbursement, facebook likes business

student suicide in madhurai : a student named shaik mohemmed suicide for unable to pay college fee. before he commits suicide he posted a photo that shows he want to die un fortunately 24people like this status

ఛీ ! చనిపోతున్నా అంటే లైక్ కొట్టారు !!

Posted: 10/27/2014 08:40 AM IST
Student suicide in madhurai


ఫేస్ బుక్ అనేది దూరాలను కలిపేందుకు.., మనకు దూరమైనవారిని దగ్గర చేసేందుకు ఉపయోగించే సోషల్ నెట్ వర్కింగ్ సైట్. దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.., నష్టాలు కూడా అంతే సంఖ్యలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫేస్ బుక్ అకౌంట్ ఉండటం సహజం అయిపోయింది. దీని బారిన పడి చాలమంది చదువులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక ఫేస్ బుక్ వల్ల మనుషుల మానసిక ప్రవర్తనల్లో మార్పులు వస్తుందన్న సర్వేలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. అవతలి వ్యక్తి కష్టల్లో ఉన్నాడు అంటే చేతనైన సాయం చేస్తాం. లేదా ఓదార్చి దైర్యం చెప్తాం రెండూ చేతకాకపోతే... అయ్యో పాపం అని మనసులో అనుకుంటాం.

కానీ ఫేస్ బుక్ వచ్చాక ఈ పద్దతి మారిపోయింది. అవతలి వ్యక్తి చచ్చిపోతున్నా అని చెప్తే లైకులు కొట్టే స్థాయికి మనుషులు దిగజారిపోయారు. ‘నాకు చనిపోవాలని ఉంది’ అని ఓ వ్యక్తి తన ఫేస్ బుక్ లో స్టేటస్ పెడితే దీనికి 24మంది లైక్ కొట్టారు. ఇంకొంతమంది అయితే ఈ స్టేటస్ ను షేర్ చేశారు కూడా. అయితే దురదృష్టవశాత్తు ఆ యువకుడు నిజంగానే చనిపోయాడు. తమిళనాడులోని మధురై నగరంలోని మంజనకార వీధిలో ఉండే కూలీ అబుదాహిర్ కుమారుడు షేక్ మహ్మద్ (18) బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దీపావళి పండగ రోజున తల్లి,తండ్రి, చెల్లి బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహ్మద్ ‘క్షమించండి, నాకు చనిపోవాలని ఉంది’ అని రాత్రి పది గంటల తర్వాత ఫేస్ బుక్ స్టేటస్ అప్ డేట్ చేశాడు.

దీపావళి మరుసటి రోజున స్నేహితులు ఫ్రెండ్స్ ఫోన్ చేసినా ఎత్తకపోవటంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే మహ్మద్ చీరతో ఉరివేసుకుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలిసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ ఫీజ్ కట్టలేకనే విద్యార్థి చనిపోయినట్లు పోలిసులు చెప్తున్నారు. దగ్గరగా ఉండే స్నేహితులకు షేక్ కష్టాలు తెలిసే ఉంటాయి. అలాంటి వ్యక్తి చనిపోతున్నా అని ఫేస్ బుక్ లో పోస్ట్ అప్ లోడ్ చేస్తే.., లైక్ కొట్టడం అనేది దారుణం.  వారు కావాలని.., అబ్బాయి చనిపోవాలని లైక్ కొట్టకపోవచ్చు. కానీ ఏం చేస్తున్నారు, ఎలాంటి పోస్టులు, కామెంట్లకు లైక్ కొడుతున్నారు అనే విచక్షణ కూడా లేకుండా వ్యవహరించటమే బాధాకరం. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే.., శవయాత్రలు కూడా ఆన్ లైన్ లో లైవ్ పెట్టించి.., వాటిని ప్రమోట్ చేసే వ్యాపారం కూడా జరిగే దౌర్భాగ్యం పట్టే అవకాశం ఉంది, జాగ్రత్త.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suicide  tamilnadu  facebook  latest news  

Other Articles