Trs leaders threatens they will stop power supply andhra people in hyderabad

power issue between telangana and andhra pradesh, power problem in telangana, power problem in andhrapradesh, andhrapradesh telangana problems, telangana andhrapradesh issues, latest updates, chandrababu naidu on telagnana power supply, kcr on power supply

trs leaders threatens they will stop power supply andhra people in hyderabad : trs leaders karne prabhakar and other leaders fired on chandrababu naidu says if ap government not gives power to telangana kcr government will stop power supply to andhra people houses and offices of andhra people

హైదరాబాద్ లో ఆంధ్రా ఇళ్లు, ఆఫీసులకు కరెంట్ కట్

Posted: 10/22/2014 08:41 AM IST
Trs leaders threatens they will stop power supply andhra people in hyderabad

విద్యుత్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల మద్య అగ్గి రాజేసిన విద్యుత్ షాకు చివరకు సామాన్యులకు తగిలేలా ఉంది. రెండు ప్రభుత్వాల మద్య జరుగుతున్న ఈ వివాదంలో ప్రజల ఇబ్బందులు పడతారేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాబు వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం రోజు తెలంగాణలో ఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. ట్యాంక్ బండ్ పై జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సునీత, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.... చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఓ వైపు కరెంటు ఇస్తామని చెప్తూనే మరోవైపు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఇస్తామని చెప్పే ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు నిలిపివేస్తుంది అని ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. బాబు వైఖరి మారకుంటే తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల ఇళ్ళు, కార్యాలయాలకు పవర్ కట్ చేసేందుకు కూడా తాము వెనకాడమని హెచ్చరించారు. ఇలా రెండు ప్రభుత్వాల మద్య రాజుకున్న రగడ ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులకు తీసుకువస్తుంది. ఏపీ ప్రభుత్వం వైఖరి మారక.., అటు తెలంగాణ రాష్ర్ట సమితి అన్నంత పనీ చేస్తే ఆంధ్రాప్రాంత ప్రజల ఇళ్ళలో దీపావళి వేళ చీకట్లే మిగులుతాయి.

అయితే ఇలా చేస్తే మాత్రం కోర్టులు జోక్యం చేసుకుని కారకులను శిక్షించటం ఖాయం. కాబట్టి ఇది కేవలం బెదిరింపే తప్ప.., నిజంగా జరిగే పని కాదు అని స్పష్టం అవుతోంది. అన్నదమ్ములుగా కలిసి ఉందామన్న రెండు ప్రభుత్వాలు ఇలా ఆస్తి తగాదాల మాదిరిగా నిత్యం కొట్టుకోవటం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  andhrapradesh  power  telangana  

Other Articles