Bjp legislators meet in chandigarh ml khattar declared as bjp legislature party leader

haryana, BJP, Narendra Modi, modi mania, RSS, legislators meet, Chandigarh, ML Khattar, CM, Legislature party leader

BJP legislators meet in Chandigarh, Manohar Lal Khattar declared Bjp Legislature party leader

హర్యానా సీఎంగా ఎంఎల్ ఖట్టర్, రేపే ప్రమాణస్వీకారం

Posted: 10/21/2014 03:27 PM IST
Bjp legislators meet in chandigarh ml khattar declared as bjp legislature party leader

హర్యానా బీజేపి శాసనసభ పక్ష నేతగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎం ఎల్ ఖట్టర్ ను ఆ  రాష్ట్ర బీజేపి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటరు తీర్పు బీజేపీకి అనుకూలంగా రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తలమునకలైన ఆ పార్టీ హర్యానా ముఖ్యమంత్రిగా ఎంఎల్ ఖట్టర్ నే బలపర్చింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కావడంతో పాటు ప్రధాని మోడీ సన్నిహుతుడు కావడం కూడీ ఖట్టర్ ను పదవి వరించేట్లు చేశాయి. హర్యానా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలిసారి అన్ని స్థానాలకు పోటీ చేసిన బీజేపి.. తన సత్తాను చాటుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది.

హర్యానా సీఎం రేసులో ఎందరో మహామహుల పేర్లు వినిపించాయి. ముందుగా కేంద్ర మంత్రి షుష్మాస్వరాజ్, కెప్టన్ అభిమన్యూ, తదిరతలు పేర్లు తెరపైడి వచ్చినా.. చివరకు కమల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖట్టర్ నే పదవి వరించింది. జనవరి 1న 1954లో జన్మించిన ఖట్టర్.. ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడై..అందులో చేరాడు. దేశ విభజన సమయంలో పాక్ అధీనంలోని పంజాబ్ రాష్ట్రం నుంచి ఆయన తండ్రి హర్బన్ లాల్ ఖట్టర్ హర్యానాకు వచ్చి స్థరపడ్డారు. ఈ తరువాత కొంత వ్యవసాయ భూమిని  తీసుకుని వ్యవసాయం చేయడం కోసం రోహ్ తక్ జిల్లా మహాం తహసీల్ పరిధిలోని నిదాన గ్రామానికి మారారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన పంజాబ్ నుంచి హర్యానాకు వచ్చారు. ఆయన తండ్రి సాధారణ కిరాణకోట్టు నిర్వాహకుడు. రోహ్ తక్ లో పదో తరగతి పూర్తి చేసిన ఖట్టర్.. ఢిల్లీకి చేరుకుని అక్కడ కిరాణా కొట్టు పెట్టాడు. దీంతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా కూడా సాధించాడు.

ఈ క్రమంలోనే ఆయన ఆర్ఎస్ఎస్ భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 24 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన.. 27 ఏళ్ల నుంచి పూర్తి స్థాయి ప్రచారకర్తగా మారాడు. కాల క్రమంగా 14 ఏళ్లపాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన ఆయన 1994లో బీజేపిలో చేరాడు. మరో 14 ఏళ్ల పాటు ఆయన హర్యానా రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆయన హర్యాన ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు.

పంజాబ్ నుంచి వలస వచ్చి హర్యానాలో స్థిరపడిన ఖట్టర్ పై బయటివాడు అన్న ముద్ర బాగానే వుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమల్ స్థానాన్ని కేటియించనప్పడే.. అయనకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అక్కడి బీజేపి నేతలు నిర్వహించారు. హర్యానాలో అధికంగా వున్న జాట్ లను కాదని, ఖట్టర్ కు స్థానాన్ని కేటాయించడంపై వారు మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ హావాతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వున్న ఖట్టర్ అక్కడి నుంచి గెలుపొందారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయనకు ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కనుంది. ప్రధాని నరేంద్రమోడీ సహా ఆర్ఎస్ఎస్ అశీస్సులు బాగా వున్న ఖట్టర్ ను బీజేపి శాసనసభాపక్షం తమ నేతగా ఎన్నుకుంది. ఇవాళ చండీగఢ్‌లో జరిగిన సమావేశంలో ఆయనను నేతగా ఎన్నుకున్నారు.

గత పదిహేనుళ్లుగా జాట్‌లే హర్యానా సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ జాట్‌యేతర అభ్యర్థి అయిన ఖట్టర్‌ను హర్యానా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఈ విధంగా జాట్‌యేతరులను సంతృప్తి పరచవచ్చుననే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన ఇవాళ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనిం పంపాల్సిందిగా కోరనున్నారు. అనంతరం బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles