Pellam poina padellaku police complaint ichaadu

wife missed husband, missing persons in india, missing cases, missing and kidnap cases, weired news, interesting news, latest updates, karnataka news, karnataka police, funny facts and news

wife missed in 2004 husband complaints after 10years : person named annappa nayak got accident and his legs factured no one is there to look after him so he remember about his wife and given police complaint now to search for her

పెళ్ళాం పోయిన పదేళ్లకు ఫిర్యాదు చేసిన భర్త

Posted: 10/18/2014 12:39 PM IST
Pellam poina padellaku police complaint ichaadu

దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు అనేది పాత సామెత.. పెళ్లాం మిస్ అయిన పదేళ్ళకు పోలిస్ కంప్లయింట్ అనేది కొత్త సామెత. అయితే ఇది సామెత కాదు.., నిజంగా జరిగింది. భార్య కన్పించకుండా పోయిన పదేళ్లకు ఆమె ఆచూకి కోసం పోలిసులను ఆశ్రయించాడు ఓ భర్త. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన అన్నప్ప నాయక్ అనే వ్యక్తి భార్య కస్తూరి పదేళ్ళ క్రితం తప్పిపోయింది. అయితే కొద్దిరోజుల పాటు అక్కడక్కడా వెతికి మర్చిపోయాడు.

కాని ఈ మద్య ఓ రోడ్డు ప్రమాదంలో అన్నప్ప రెండు కాళ్ళు విరిగిపోయాయి. సహాయం చేసేందుకు ఎవరూ లేరు. నా అనే వారు ఎవరూ దగ్గరకు రాకపోవటంతో.., కట్టుకున్న పెళ్ళాం గుర్తుకువచ్చింది. వెంటనే పోలిస్ స్టేషన్ కు వెళ్ళి తన భార్య కన్పించటం లేదు అని కంప్లయింట్ ఇచ్చాడు. పోలిసులు కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. కంప్లయింట్ తీసుకోక తప్పదు కాబట్టి. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. అన్నప్ప ఇచ్చిన ఆధారాలతో వెతికిపెడతాము అని భరోసా ఇచ్చారు.

కన్పించకుండా పోయినప్పుడే పోలిస్ కంప్లయింట్ ఇచ్చి ఉంటే ఏమైనా ఫలితం ఉంటుంది కానీ.., పదేళ్ళకు ఫిర్యాదు చేస్తే పోలిసులు అయినా ఎలా వెతికి పట్టుకుంటారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒంట్లో బలం ఉన్నపుడు భార్య గుర్తుకు రాలేదు కానీ.., మంచంపై పడగానే సేవలు చేయటానికి గుర్తుకు వచ్చిందా అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఏదయితేనేం.., కర్ణాటక పోలిసులు కన్పించకుండా పోయిన కస్తూరిని అన్నప్ప చెంతకు ఎలా చేరుస్తారో వేచి చూద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife  husband  missing  latest updates  

Other Articles