Class 12 student killed by friend after a scuffle over a phone charger

delhi crime news, student died for cell charger, delhi student killed by friend, student killed by friend for charger, cell phone charger issue, delhi 12 standard students clashes, 12 standard student killed by friend cell charger, cell charger issue, delhi cell charger issue

Class 12 student killed by friend after a scuffle over a phone charger

విద్యార్థి ప్రాణాలను బలితీసుకున్న సెల్ ఫోన్ ఛార్జర్!

Posted: 10/17/2014 08:27 PM IST
Class 12 student killed by friend after a scuffle over a phone charger

మానవుడు తన అవసరాలకోసం ఏ పరికరాలను అయితే సృష్టించాడో.. ఇప్పుడు అవే అతని ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. నిత్యం అని చెప్పలేంకానీ.. ఏవో ఒక సందర్భంలో కొన్ని వస్తువుల వల్ల అప్పుడప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అటువంటి సంఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రస్తుతకాలంలో సెల్ ఫోన్ వాడకం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే! విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో ఇది నిత్యావసరంగా మారిపోయింది. ఇక సెల్ ఫోన్ వాడుతున్నారంటే దానికి చార్జింగ్ కూడా పెట్టాల్సిందే కదా! అటువంటి సెల్ చార్జర్ విద్యార్థి ప్రాణాలనే బలితీసుకుంది. అయితే అది షాక్ కొట్టడంవల్ల గానో, ఇతర వ్యవహారాల్లోనో ఆ చార్జర్ విద్యార్థి ప్రాణాలను బలితీసుకోలేదులెండి... తమ సెల్ ఫోన్ బ్యాటరీ ‘లో’ అయిపోయిందని చార్జింగ్ పెట్టుకునే విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసుకుంది.

ఢిల్లీలోని రాస్ హోల్లా ప్రాంతంలో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సన్నిహితంగానే వుండేవారు. అయితే సెల్ ఛార్జర్ విషయంలో అనుకోకుండా వీరిద్దరూ ఘర్షణపడ్డారు. మాటమాట తారాస్థాయికి చేరిపోవడంతో ఒకరికొకరు తీవ్రంగా కొట్టేసుకున్నారు. దీంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని దగ్గరలో వున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. దీంతో మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crime news  delhi 12 standard student killed  murder  cell charger issue  

Other Articles