Indian activist shares nobel peace prize with malala

Kailash Satyarthi, Bachpan Bachao Andolan, Malala Yousafzai, Gandhi, Nobel prize, Talibans, education, peaceful protests, demonstrations, child exploitation

Indian child rights activist Kailash Satyarthi and Pakistan’s Malala Yousafzai have been awarded the coveted Nobel Peace Prize

కైలాష్ సత్యర్థి, మలాలకు నోబుల్ శాంతి పురస్కారం

Posted: 10/10/2014 03:48 PM IST
Indian activist shares nobel peace prize with malala

ఆసియా ఖండంలో బాలల హక్కుల ఉద్యమకారుల సేవలను నోబుల్ బహుమతి అవార్డుల మండలి గుర్తించింది. బాలల హక్కుల కోసం శాంతియుత మార్గంలో ఉద్యమించిన కైలాష్ సత్యర్థిలకు ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతిని ప్రకటించారు.
భారత్ దేశంలో బాల కార్మికులను నిర్మూలించాలని, వారి హక్కుల కోసం గత 24 ఏళ్లుగా ఉద్యమిస్తున్న కైలాష్ సత్యర్థికి ఎట్టకేలకు ప్రపంచ గుర్తింపు దక్కింది. గాందేయ మార్గంలో శాంతియుతంగా బాలల హక్కుల కోసం ఉద్యమించారు. పలు విధాలుగా ఆందోళనలు , నిరసనలు చేసిన ఆయన కేవలం ధనార్జన కోసం పసిపిల్లలను కార్మికులుగా వాడుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికలపై ఆయన బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారు.  అంతర్జాతీయ వేదికలపై బాలల హక్కుల కోసం ఆయన చేసిన ప్రసంగాలు కూడా అంతర్జాయంగా ఉపకరించాయి. బచపన్ బచావో ఆందోళన్ పేరిట స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి.. బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకున్న 80 వేల మంది బాల కార్మికులను ఆయన విడిపించారు.

అటు పాకిస్థాన్ బాలల హక్కుల పోరాట ఉద్యమకారిణి మలాలా యూసప్ జాయ్ కూడా బాలికల చదువుపై ఉధ్యమించింది. బాలికలు చదువులెందుకు అంటూ..? ప్రశ్నించి.. వారిని పాఠశాలకు పంపవద్దని ఆదేశించిన తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడి వారి తుపాకీ గుళ్లును ధీటుగా ఎదుర్కోన్న ధీర బాలిక. ప్రాణాపాయ స్థితి నుంచి మలాలా కోలుకోవాలని పాకిస్థాన్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు దేవుణ్ని ప్రార్థించారు. బాలికలు కూడా చదవుకోవాల్సిందేనంటూ ఉద్యమించారు. తన ధీరత్వంలో బాలికలకు విద్యాహక్కు అనే అంశంపై అధికార ప్రతినిధిగా ముందున్నారు

 ఓ యువకుడుచ చిన్నారి,, ఓ హిందువుతో పాటు ఓ మహ్మదీయురాలు.. ఓ ఇండియన్.. ఓ  పాకిస్థానీ అన్ని వేర్వేరు అయినా.. వారిరువురు కలసి ఒకే అంశంపై పోరాడటం ముదావహమని నోబుల్ బహుమతి అవార్డుల మండలి అభిప్రాయపడింది. 278 మంది బాలహక్కుల ఉద్యమకారుల నుంచి ఎంపిక చేశామని తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles