Are you the luckiest and also the healthiest

office workers, protein rich food, belly stiff, avoid oil foods, fruit salad, sprouts, small exercise, green tea

office workers must take protien rich food, which keeps your belly stiff

అదృష్టవంతులేనా.. ఆరోగ్యవంతులు కూడానా..?

Posted: 10/10/2014 09:53 AM IST
Are you the luckiest and also the healthiest

ఆఫీసుల్లో పనిచేస్తున్నారా..? సంతోషంగా వున్నారా..? కాలు కదపకుండా కుర్చీలో కూర్చోనే ఉద్యోగం వచ్చింది.. ఏదో చేసుకుంటున్నాం అంటారు.. అంతేగా.. మీరు అదృష్టవంతులే.. కానీ ఆరోగ్య వంతులు కూడా కావాలంటే చిన్న చిన్న విషయాలను ఆచరించాలి. ఆహర వ్యవహారాల్లో స్వల్ప మార్పలను చేసుకోవాలి. అంతే మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారు. మీరు జాగ్రత్త వహించని పక్షంలో మీ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. మీ పోట్ట విపరీతంగా పెరిగి, మీకే ఇబ్బందిగా మారే పరిణామాలు ఉత్పన్నం కావచ్చు.

ఎక్కువసేపు కదలకుండా కూర్చొని ఉంటారు. ఇలా పనిచేసే వాళ్లు తమ ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల పొట్ట వస్తుంది. ఇది వచ్చిందంటే.. ఆ వెంటే పలు రకాల జబ్బులూ వెన్నంటి వస్తాయి. ఇటువంటి సమస్యలేవీ రాకుండా ఉండాలంటే ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్స్‌ తమ ఆహారం మార్పలు చేసుకోవాలి.

ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌లు మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఉండడం తప్పనిసరి. ఇందుకోసమని రెండు పుల్కాలు, రాజ్మా కూర లేదా బ్రౌన్‌రైస్‌తో గుడ్డు, కూరలు తినాలి. లేదంటే చీజ్‌ శాండ్‌విచ్‌ తినొచ్చు. ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న భోజనం తీసుకుంటే పొట్ట రాదనే విషయం మీకు తెలుసుకదండీ. సాయంత్రాలు తీసుకునే స్నాక్స్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.. వీటి వల్లే పొట్ట చుట్టూ బరువు పెరుగుతుంది. నూనె పదార్థాలైన బజ్జీ, సమోసా, పఫ్స్‌ వంటివి అస్సలు తినకూడదు. వాటికి బదులు ఫ్రూట్‌ సలాడ్‌, పొట్టు తీయనిగింజలతో తయారుచేసిన చాట్‌, మొలకెత్తిన గింజల వంటివి తినాలి. ఆ తరువాత గ్రీన్‌ టీ తాగితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ తరువాత వీలు కుదిరతే చిన్న శారీరక వ్యాయామం చేస్తే భవిష్యత్తులో అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.

ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకి ఎక్కువసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఎక్కువసార్లు టీ తాగడం వల్ల భోజనం వాయిదా వేస్తారు. కొందరయితే టీతో పాటు సిగరెట్లు కూడా తెగ పీల్చేస్తారు. ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. లేదంటే అల్సర్లు, కేన్సర్ల ముప్పు మీద పడడం ఖాయం. అందుకని రోజు మొత్తంలో ఎక్కువలో ఎక్కువ మూడుసార్లు టీ తాగాలి. అదికూడా ఒకటిన్నర టీస్పూను చక్కెరతో మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం, స్నాక్స్‌ తినే అలవాటు చేసుకుంటే అతిగా తినే అలవాటు తగ్గుతుంది. దీంతో కూడా పోట్ట రాకుండా వుంటుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles